Movies

వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా శాటిలైట్ రైట్స్ ఎంత పలికాయో తెలుసా?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తాజాగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.అయితే భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా మొదటి రోజే డివైడ్ టాక్ తెచ్చుకుంది.గత ఏడాది విజయ్ కి వరుసగా మూడు డిజాస్టర్ లు వచ్చి పడ్డాయి.వాటి నుంచి తేరుకొని ఈ వరల్డ్ ఫేమస్ తో ఎలా అయిన హిట్ కొట్టాలని భావించాడు.

క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.అయితే కంటెంట్ పరంగా ఒకే అనిపించుకున్న సినిమా నేరేషన్ ఎఫెక్ట్ వలన బోర్లా పడిందనే టాక్ వినిపిస్తుంది.ప్రేమలో ఉండే ఎమోషన్ ని నాలుగు కథలలో చెప్పాలని ప్రయత్నం చేసిన అది ఎందుకో ఆడియన్స్ కన్విన్స్ అయ్యే ఎలివేషన్ తో నేరేట్ చేయలేకపోయారనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది.జెమినీ టెలివిజన్ వాళ్ళు వరల్డ్ ఫేమస్ శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.అయితే ఇప్పుడు ఈ సినిమాకి వస్తున్నా డివైడ్ టాక్ తో వారు కొంత టెన్షన్ లో పడ్డారు.

అయితే విజయ్ సినిమాలు అన్ని మొదటి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్న తరువాత మెల్లగా పుంజుకున్నాయి.ఈ సినిమా కూడా అలాగే పుంజుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.ఏది ఏమైనా ఒక వేళ ఈ సినిమా తేడా కొడితే మాత్రం పూరీ దర్శకత్వంలో తెరకేక్కబోయే ఫైటర్ సినిమా మీదనే విజయ్ దేవరకొండని తిరిగి ట్రాక్ లోకి తీసుకురావాలి.మరి ఈ వరల్డ్ ఫేమస్ పూర్తి రిజల్ట్ తెలియాలంటే మాత్రం కొద్ది రోజు వేచి చూడాల్సిందే.