“డియర్ కామ్రేడ్” ను కూడా అందుకోలేని “వరల్డ్ ఫేమస్ లవర్”
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఏకంగా నలుగురు హీరోయిన్లతో కలిసి చేసిన చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నిన్ననే లవర్స్ డే సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది.కానీ సినిమా మొదటి ఆటతోనే తేలిపోవడంతో విజయ్ ఖాతాలో మరో దెబ్బ పడింది.అయితే విజయ్ అతి తక్కువ కాలంలోనే టైర్ 2 హీరోలలో ఒక టాప్ హీరోగా మారిపోయాడు.
కానీ తాను అందుకున్న ఈ స్టార్డం ను నిలిపోవడంలో మాత్రం విఫలం అవుతున్నాడని చెప్పాలి.గీత గోవిందం తర్వాత ప్రతీ రోజు తన ప్రతీ సినిమాకు కూడా గ్రాఫ్ పడిపోతుంది కానీ లేచింది లేదు.అలా తన మునుపటి చిత్రం “డియర్ కామ్రేడ్ రికార్డులను కూడా విజయ్ అందుకోలేకపోవడం గమనార్హం.ఈ టైర్ 2 హీరోలలో నైజాం డే 1 వసూళ్లను చూసుకున్నట్టయితే రామ్ నటించిన “ఇస్మార్ట్ శంకర్” 3.36 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో నాని నటించిన “ఎంసిఏ” 26 లక్షల తేడాతో ఉంది.
అలాగే వీటి తర్వాత విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ 2.75 కోట్లను మొదటి రోజు రాబట్టగా నిన్న విడుదల కాబడిన వరల్డ్ ఫేమస్ లవర్ మాత్రం 2.02 కోట్ల దగ్గరే ఆగిపోయింది.దీనిని బట్టి విజయ్ క్రేజ్ ఎంతలా తగ్గిపోతుందో మనం అర్ధం చేసుకోవచ్చు.రాబోయే రోజుల్లో విజయ్ కానీ స్క్రిప్టుల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తళుక్కుమని మెరిసి కనుమరుగైపోయిన హీరోల జాబితాలో మిగిలిపోతాడని చెప్పాలి.