“సాహో”ను హిందీ జనం పట్టించుకోలేదా.? కారణం ఇదేనా…?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ “సాహో”. సుజీత్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రభాస్ నుంచి మరో పాన్ ఇండియన్ చిత్రంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది.అయితే ఈ చిత్రం ఒక్క హిందీలో తప్పితే మిగతా భాషల్లో ఎక్కడా చెప్పుకోదగ్గ స్థాయి వసూళ్లను రాబట్టలేకపోయింది.అలా ఓవరాల్ గా హిందీలో మాత్రమే బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అయితే ఇదే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంతైతే సక్సెస్ అయ్యిందో స్మాల్ స్క్రీన్ దగ్గర అదే స్థాయిలో చతికిల పడ్డట్టు తెలుస్తుంది.
ఈ చిత్రాన్ని వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ సినిమా వారు గత జనవరి 26న టెలికాస్ట్ చెయ్యగా దీనికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ కానీ ఇంప్రెషన్స్ కానీ వెంటనే బయటకు రాలేదు.దీనికి కారణం ఊహించదగ్గ స్థాయిలో ఈ హిందీ జనం ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి కనబర్చకపోవడమే అని ఊహాగానాలు వినిపించాయి.కానీ అనూహ్యంగా అది ఇప్పుడు నిజమే అని ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది.
ఈ చిత్రాన్ని అక్కడ టెలికాస్ట్ చెయ్యగా కేవలం 1 లక్ష 28 వేల టెలివిజన్ ఇంప్రెషన్స్ మాత్రమే పడ్డట్టు తెలుస్తుంది.పాన్ ఇండియన్ స్టార్ గా ప్రభాస్ కు ఇది తక్కువే అని చెప్పాలి.ఇటీవలే మన తెలుగులో టెలికాస్ట్ అయిన గద్దలకొండ గణేష్ చిత్రానికే 91 లక్షలకు పైగా ఇంప్రెషన్స్ వచ్చి పడ్డాయి.అంటే ఈ లెక్కన సాహో కు ఇది చాలా తక్కువ అనేగా..మొత్తానికి మాత్రం ప్రభాస్ ను వెండితెర మీద ఆదరించిన హిందీ ప్రేక్షకులు బుల్లితెర మీద కాస్త పక్కన పెట్టేశారని చెప్పాలి.