భారీ డిజాస్టర్ దిశగా సమంతా “జాను”…సమంతా మాయ లేదు
తమిళ్ లో విజయ్ సేతుపతి మరియు త్రిష్ హీరో హీరోయిన్లుగా సి ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చిత్రం “96”. అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం తెలుగులో “జాను”గా రీమేక్ అయ్యి ఇటీవలే విడుదల అయ్యింది.శర్వానంద్ హీరోగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ చిత్రం మన దగ్గర కూడా మంచి టాక్ నే సంహరించుకుంది
కానీ ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అయ్యే సూచనలు ఎక్కడా కనిపించడం లేదని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.ఈ చిత్రానికి మొత్తం 21 కోట్లకు బిజినెస్ కాగా ఇప్పటి వరకు 6న్నర కోట్ల రూపాయల షేర్ ను మాత్రమే రాబట్టినట్టు తెలుస్తుంది.దీనితో ఈ చిత్రానికి ఎలా లేదన్నా 70 శాతం వరకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.అయితే దీనికి కారణం ఈ సినిమా కోసం చాలా మందికి తెలిసి ఉండడం అలాగే ఇప్పటికే ఒరిజినల్ వెర్షన్ ను చూసెయ్యడం వంటి వాటి మూలంగా ఈ చిత్రంపై ఈ విధమైన ఎఫెక్ట్ పడిందని చెప్పాలి.