Movies

నయనతార,సమంతా మధ్యలో కోల్డ్ వార్…కారణం ఇదే…?

సినీ తారల మధ్య పోటీ సహజం. అందునా అగ్ర తారలైతే మరీను. ఇక కోలీవుడ్ లో నయనతార స్టార్ డమ్ గురించి, టాలీవుడ్ లో అక్కినేని కోడలు సమంత రేంజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకరు కోలీవుడ్ లో అగ్రహీరోయిన్, సౌత్ అంతటా పాపులార్ స్టార్, మరొకరు టాలీవుడ్ లో పోటీ లేని తారగా, నెంబర్ వన్ స్టాటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇద్దరూ ఒకరికొకరు ఎందులోనూ పోటీ కాదు. ఇప్పటివరకూ అలాంటి సన్నివేశం వాళ్ల మధ్య తలెత్తలేదు. అక్కడ నయన్…ఇక్కడ సామ్ చక్కని ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. సౌత్ అంతటా ఈ ఇద్దరికీ పాపులారిటీ ఉంది.

నయన్ ఇండస్ట్రీ బెస్ట్ సినిమాల్లో నటిస్తూ తనకు ఎదురే లేదని నిరూపిస్తున్నారు. ఇటీవల సమంత తనకు తానుగా సినిమాల స్పీడ్ తగ్గించి సరికొత్త ప్రణాళికలతో దూసుకొచ్చే ప్లాన్ లో ఉన్నారు. కానీ ఇప్పుడు వాళ్లిద్దరి మధ్య బిగ్ ఫైట్ మొదలైందనేది కోలీవుడ్ లో వినిపిస్తోంది. తాజాగా, ఈ భామలిద్దరు కోలీవుడ్ లో విజయ్ సేతుపతి సరసన నటిస్తున్నారు. నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్టర్ గా విజయ్ సేతుపతి హీరోగా `కాత్తు వక్కుల రెందు కాదుల్` అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఇందులో హీరోయిన్లుగా నయన్… సమంతలను ఎంపిక చేసారు. ఈ మూవీ ముక్కోణపు ప్రేమ కథతో తెరకెక్కుతోంది.

ఆ లవ్ స్టోరీనే ఇద్దరు నాయికల మధ్య చిచ్చుకు కారణమైందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. విజయ్ సేతుపతి కోసం ఇద్దరు భామలు గొడవ పడుతున్నారుట. విజయ్ తో తెరను ఎక్కువ సేపు పంచుకునే అంశంపైనే ఇద్దరి మధ్య చిచ్చు రేగినట్లు ప్రచారమవుతోంది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ లో ఆసక్తికరంగా మారింది. గతంలో ఇలాంటి వివాదం ఒకటి `ఎంతవాడు గానీ` సినిమా విషయంలో త్రిష- అనుష్క ల మధ్య తలెత్తింది.

అజిత్ తో ఎక్కువ సన్నివేశాల్లోనటించే అవకాశం తనకే దక్కింది అంటూ ఆ ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడ్డారు. అజిత్ తో ఎక్కువ సేపు స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ ఫస్ట్ లీడ్ అంటూ మొదలైన మాటల యుద్ధం చాలా దూరమే వెళ్లింది. ఆ తర్వాత ఈ వివాదాన్ని అజిత్ స్వయంగా పరిష్కరించారు. మళ్లీ అలాంటి వివాదం తాజాగా నయన్-సమంత మధ్య తెరపైకి వచ్చేసిందట.