వాణిశ్రీ సినిమాలకు దూరం కావటానికి కారణం ఎవరో తెలుసా?ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
అలనాటి ప్రముఖ హీరోయిన్ వాణిశ్రీ గారు తన కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో చిత్ర సీమ నుంచి విరమించుకోవాలనే ఆలోచనకు బీజం వేసిన సందర్భం మీకు తెలుసా? ఎన్టీఆర్ కు జోడిగా, బాపయ్య గారి డైరెక్షన్ లో, నిర్మాత అశ్వని దత్తు గారి మొదటి చిత్రం “తిరుగులేని మనిషి” షూటింగ్ లో ఒక సాంగ్ లో డాన్స్ డైరెక్టర్ చెప్పిన మూవ్మెంట్స్ చేయటానికి వాణిశ్రీ అభ్యంతరం చెప్పారు, ఆ మూవ్మెంట్స్ అసభ్యకరంగా ఉన్నాయని, తాను చేయనని చెప్పారు. డాన్స్ డైరెక్టర్ ఏమో, ఏం చేయమంటారు మేడం డైరెక్టర్ గారు అలాగే కావాలని అంటున్నారు అన్నారట.
వాణిశ్రీ గారు డైరెక్టర్ తో ఆ విషయం చెప్పిన, అయన ఏమి చెప్పలేక ముఖం చాటేశారు. చివరకు వాణిశ్రీ గారు ఎన్టీఆర్ గారితో మోర పెట్టుకున్నారు, ఏంటి సార్ ఆ మూవ్మెంట్స్ మరి అసహ్యంగా ఉన్నాయి అని. అప్పటికే కొత్త తరం నటుల పోటీ విపరీతం గా ఉండటం కారణం గా ఎన్టీఆర్ గారు, ఏం చేద్దాం వాణిశ్రీ గారు మనం చేయక పోతే ఇంకొకరు చేస్తారు అన్నారట చాల నిర్లిప్తంగా . మంచి నటిగా ఉన్నత శిఖరాలను చుసిన వాణిశ్రీ గారు, మారుతున్న పరిస్థితులను చూసి ఇక సినిమా రంగం నుంచి గౌరవంగా తొలగి పోవటం మంచిది అని నిర్ణయించుకున్నారు. అంతే అప్పటినుంచి మెల్లగా సినిమాలు తగ్గించుకొని పెళ్లి చేసుకొని సినిమా రంగానికి దూరంగా వెళ్లి పోయారు.