Movies

యంగ్ రామ్,జాను పాత్రలో నటించిన గౌరీ,సాయిల బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

తమిళంలో క్లాసిక్ గా నిల్చిన 96కి రీమేక్ గా తెలుగులో శర్వానంద్,సమంత జంటగా నటించిన జాను మూవీ గత వారం ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి మార్కులే తెచ్చుకుంది. జానుగా సమంత నటన అదిరిపోయింది. ఇక ఈ మూవీలో సమంత చిన్ననాటి పాత్రలో స్కూల్ డేస్ లో నటించిన గౌరీ సీతా కిషన్ సూపర్ క్యూట్ గా అలరించింది. తన నటనతో ఆడియన్స్ కి దగ్గరైంది. ఎందుకంటే తమిళంలో 96లో యంగ్ త్రిష పాత్రలో కూడా ఈ అమ్మాయే నటించింది. తమిళంలో ఈమె నటన చూసిన దిల్ రాజు తెలుగులో కూడా ఈమెనే ఎంచుకున్నాడు.

కర్ణాటకలోని బెంగుళూరుకి చెందిన గౌరికి అటు తమిళంలో,ఇటు తెలుగులో కూడా తొలిసినిమా ఇదే కావడం విశేషం. ఈమె నటనతో ఫిదా అయిన దర్శక నిర్మాతలు ఈమెను ఎంపిక చేసుకోవడంతో అరడజనుకి పైనే సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించే మాస్టర్ మూవీలో కూడా గౌరీ నటిస్తోంది. హలొ కాథల్ అనే లవ్ స్టోరీలో హీరోయిన్ గా నటించింది. ఇక మాలయంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. అంతేకాదు గౌరితో దిల్ రాజు ఓ సినిమా చేయబోతున్నట్లు జాను ఆడియో ఫంక్షన్ లో ప్రకటన కూడా చేసారు.

అలాగే ఈ మూవీలో యంగ్ శర్వానంద్ పాత్రలో బిటెక్ చదువుతున్న సాయికిరణ్ నటించాడు. ఏమాత్రం సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా,పేపర్ లో ప్రకటన చూసి ప్రయిత్నించమని అతడి అక్క ఎంకరేజ్ చేసింది. దరఖాస్తు చేయడంతో దిల్ రాజు నుంచి ఫోన్ వచ్చింది. రెండు సార్లు ఆడిషన్స్ చూసి అతడిని ఎంపిక చేసారు. శర్వానంద్ పోషించిన రామ్ పాత్రకు తగ్గట్టుగా యంగ్ రామ్ గా సాయి కిరణ్ అద్భుతంగా నటించాడు. ఇలా గౌరీ,సాయి నటనకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు.