ఎన్టీఆర్ పొలిటికల్ మూవీ చేస్తున్నాడా…ఆ దైర్యం చేస్తున్నాడా…?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కల్సి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న ఈ భారీ మూవీ 2021జనవరి 8న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల చేయాలని పాలన్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ తర్వాత తారక్ చేయబోయే సినిమా గురించి జోరుగా చర్చ నడుస్తోంది.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తారక్ తొలిసారి నటించిన అరవింద సమేత వీర రాఘవ 2018లో విడుదలైంది. మాస్ ఆడియన్స్ ని అలరించిన ఈ మూవీ ఘనవిజయాన్ని నమోదుచేసుకుంది. దీని తర్వాత తారక్ చేస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ ఏడాది రిలీజ్ అవుతుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అందుకే సినిమా సినిమాకు ఇంతలా గ్యాప్ కాకుండా వరుస సినిమాలతో అదరగొట్టాలని ఎన్టీఆర్ భావిస్తున్నాడట.
అయితే ఆర్ ఆర్ ఆర్ తర్వాత హారిక అండ్ హాసిని సంస్థలు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తారక్ తో సినిమా చేయనున్నాయని వినిపిస్తోంది. రష్మిక మందన, పూజా హెగ్డే హీరోయిన్స్ గా సెలెక్ట్ చేస్తున్నారట. అయిననూ హస్తినకు పోయి రావలె అనే టైటిల్ డిసైడ్ చేశారట. ఈ మూవీ ని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. అయితే తారక్ డిఫరెంట్ గా ఓ పొలిటికల్ మూవీ చేస్తాడని టాక్ నడుస్తోంది. ఇక తమిళ డైరెక్టర్ విట్టరే మారన్ తో తారక్ ఓ సినిమా చేయనున్నట్లు కూడా టాక్. మరి ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏ సినిమా ముందు స్టార్ట్ చేస్తాడో చూడాలి.