కుక్క బిస్కెట్స్ తింటున్న టాలీవుడ్ హీరోయిన్…ఎవరో తెలిస్తే షాక్
హీరోయిన్ రష్మిక మండన్నాని, హీరో నితిన్ ఆటపట్టించాడు. అదీ ‘డాగ్ బిస్కెట్స్’, ‘పిడిగ్రీ’ అంటూ. అదేంటీ, రష్మికకీ వాటికీ సంబంధమేంటి.? అంటే, రష్మిక ఓ సారి డాగ్ బిస్కెట్స్‌ని టేస్ట్ చేసిందట. ఆ విషయాన్ని నితిన్, తన తాజా సినిమా ‘భీష్మ’ ప్రమోషన్స్‌లో వెల్లడించాడు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా రష్మిక షాక్‌కి గురయ్యింది. నితిన్‌ని కంట్రోల్ చేయడానికి రష్మిక చాలా ప్రయత్నించిందిగానీ.. వీలు కాలేదు. నితిన్ – రష్మిక మధ్య ఈ ఫన్ చాలాసేపు నడిచింది.
‘జస్ట్ ఫర్ ఫన్’ అని నితిన్ చెప్పడం, రష్మిక.. ఈ మొత్తం ఎపిసోడ్‌ని మేగ్జిమవ్‌ు ఎంజాయ్ చేయడం చాలా క్యూట్‌గా అనిపించింది. తనకు ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనే కోరిక చాలా చాలా ఎక్కువనీ, ఈ క్రమంలోనే ఓ సారి డాగ్ బిస్కెట్స్ టేస్ట్ ఎలా వుంటుందో తెలుసుకోవాలనుకున్నాననీ, ఆ కారణంగానే డాగ్ బిస్కెట్‌ని టేస్ట్ చేశానని రష్మిక చెప్పింది. ‘ఎలా వుందది.?’ అనడిగితే ‘బాగానే వుంది’ అని రష్మిక సమాధానమిచ్చింది. బహుశా ఇదే, రష్మిక ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమో.. అని నితిన్ సెటైర్లు కూడా వేశాడు.