Movies

శ్రీకాంత్ ఇంటిలో తీవ్ర విషాదం…తరలి వెళుతున్న సినీ ప్రముఖులు

టాలీవుడ్‌లో ఫ్యామిలీ సినిమాల హీరోగా శ్రీకాంత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు.తన కెరీర్‌లో 100కు పైగా సినిమాలు చేసిన శ్రీకాంత్, ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు.కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ పాత్రల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు.స్టార్ హీరోల సినిమాలు మొదలుకొని యంగ్ హీరోల సినిమాల వరకు శ్రీకాంత్‌ను తమ సినిమాల్లో తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

అయితే తాజాగా శ్రీకాంత్ ఇంట్లో విషాదం నెలకొంది.శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు సోమవారం ఉదయం 2.30 గంటల ప్రాంతంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.గతకొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన మృతిచెందడంతో శ్రీకాంత్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.

కృష్ణా జిల్లాకు చెందిన పరమేశ్వరరావుకు భార్య ఝాన్సీ లక్ష్మీ, కుమారులు శ్రీకాంత్, అనిల్ మరియు కూతురు నిర్మల ఉన్నారు.శ్రీకాంత్ తండ్రి మరణంతో పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.కాగా హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో పరమేశ్వరరావు అంత్యక్రియలు జరగనున్నాయి.