Movies

టిక్ టిక్ టిక్ హీరోయిన్ స్వప్న ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే అసలు నమ్మరు…!

కొందరు హీరోయిన్స్ వయస్సు లో ఉండగా చాలామందికి కలల రాణులుగా కనిపిస్తారు. అదే ఓ పాతికేళ్ళు గడిస్తే అసలు గుర్తుపట్టలేరు. కానీ 1981లో డాక్టర్ దాసరి నారాయణరావు చేతులమీదుగా పరిచయం అయిన నటి స్వప్న పేరు మంజలి బేబీ. అయితే స్వప్న అనే సినిమాతో అదేపేరుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. చెన్నైలో పెరిగిన ఈమె మిస్ మద్రాసు స్వప్న గా సెలక్ట్ అవ్వడంతో దాసరి కళ్ళల్లో పడింది. అంతే హీరోయిన్ గా ఛాన్స్ వచ్చేసింది. ఆతర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు

తెలుగులోనే కాదు,మలయాళం,తమిళం,హిందీ భాషల్లో కూడా స్వప్న తన సత్తా చాటింది. అన్ని భాషల్లో 100సినిమాలకు పైనే నటించింది. కమల్ హాసన్ నటించిన టిక్ టిక్ టిక్ సినిమా తెలుగు ,తమిళ భాషల్లో రావడంతో స్వప్నకు మంచి గుర్తింపు వచ్చింది. బిర్లా రంగా సినిమాలో చిరంజీవి సరసన చేసింది. రజనీకాంత్,అమితాబ్, మోహన్ లాల్,ముమ్ముట్టి వంటివారితో కల్సి నటించింది. 1992లో హీరోయిన్ గా రిటైర్మెంట్ తీసుకుని, రమణ్ ఖన్నాతో ప్రేమలో పడి 1993లో పెళ్లి చేసుకుంది.

ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన స్వప్న పెళ్లి తర్వాత దాదాపు 20ఏళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఈమెకు 20ఏళ్ళ కొడుకు ఉన్నాడు. అతడు పూణేలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. సినిమాలు ఎంతగా ఇష్టం వున్నా సరే,పెళ్లయ్యాక అసలు అటువైపు రాలేదు. భర్తతో కల్సి ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలో చేరి, బాలీవుడ్ తో సహా వరల్డ్ వైడ్ గా క్లాసికల్ ఈవెంట్స్ చేస్తోంది. దాదాపు 10కి పైగా దేశాల్లో తిరుగుతూ బిజినెస్ రంగంలో బాగా సెటిల్ అయింది. అయితే నిన్నటి తరంలో డ్రీమ్ గర్ల్ గా ఉండే స్వప్న ఇప్పుడు లావెక్కినా అందం మాత్రం ఏమీ తగ్గలేదు.