Movies

“వరల్డ్ ఫేమస్ లవర్” వసూళ్ల పరిస్థితి ఇంత దారుణమా…అయోమయంలో విజయ్

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్” ఈ ప్రేమికుల దినోత్సవం నాడు విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే.మొదట పెద్దగా అంచనాలను తెచ్చుకోని ఈ చిత్రం విడుదలకు ముందు విజయ్ ఏదొకలా హైప్ ను తెచ్చుకున్నాడు.కానీ అది కూడా ఏమాత్రం ఉపయోగపడలేకపోయింది.విజయ్ పేరుతో బిజినెస్ బాగానే జరిగినా ఆ మొత్తాన్ని రాబట్టడంలో మాత్రం విజయ్ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి.

విజయ్ సినిమాకు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 23 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పటి వరకు కేవలం 5.9 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టగలిగింది.దీనితో ఫుల్ రన్ లో మహా అయితే 10 కోట్లు రాబట్టొచ్చని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.ఇక్కడ పరిస్థితే ఇలా ఉంటే ఓవర్సీస్లో మహా దారుణంగా ఉందని తెలుస్తుంది.ఈ చిత్రానికి ఇప్పటి వరకు అక్కడ రెండు లక్షల డాలర్లు మాత్రమే వసూలు అయినట్టు తెలుస్తుంది.ఇది అక్కడ ఈ సినిమాకు పెట్టిన ఖర్చులు కన్నా తక్కువే అని టాక్ వినిపిస్తుంది.ఈ లెక్కన చూస్తుంటే విజయ్ ఖాతాలో మరో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ తప్పదని అనిపిస్తుంది.