నిర్మాత కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న రౌడీ…పారితోషికం వెనక్కి…?
సినిమాల కోసం కోట్ల కోట్లు పారితోషికం తీసుకోవడమే కాదు, అడిగినంత పారితోషికం ఇచ్చిన ఆ నిర్మాత కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి కూడా. ఇప్పుడు అదే చేశాడు విజయ్ దేవరకొండ. తన తాజా సినిమా `వలర్డ్ ఫేమస్ లవర్` శుక్రవారం విడుదలైంది. ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఈ సినిమా కొన్న బయ్యర్లు, తీసిన నిర్మాత నష్టాల్లో కూరుకుపోయారు. అందుకే విజయ్ తన వంతు సాయం అందించడానికి ముందుకొచ్చాడు. తన పారితోషికంలో కొంత భాగం వెనక్కి ఇచ్చి, నష్టాల్ని తగ్గించాలని భావించాడు.
కె.ఎస్.రామారావు ఇప్పటికే కొంత మొత్తం విజయ్‌దేవరకొండకి ఇవ్వాలి. అయితే ఆ డబ్బులు విజయ్ తీసుకోవడం లేదట. అంతే కాదు.. తన పారితోషికంలో కొంత భాగం తిరిగి ఇచ్చేశాడట. అలా.. నిర్మాత కష్టాల్లో ఉన్నప్పుడు తనవంతుగా ఆదుకున్నాడు. విజయ్ వరల్డ్ ఫేమస్ లవర్ కాలేకపోయాడు గానీ, వరల్డ్ బెస్ట్ హీరో మాత్రం అయ్యాడిలా.