జాను ఇచ్చిన షాక్ తో సమంతా సంచలన నిర్ణయం..షాక్ లో నాగ చైతన్య
ఇండస్ట్రీలో ఎవరికైనా కొన్ని ఎంబిషన్స్ ఉంటాయి. అందులో కొత్త సంవత్సరం అనగానే హిట్ కొట్టాలని ఉంటుంది కదా. ఇదే తరహాలో కొత్త ఏడాదిని సంతోషంగా మొదలు పెట్టాలని ఆశించిన సామ్ కి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఇటీవలి కాలంలో వెంటపడిన పలు ఛాన్స్ లన్నీ వ్యక్తిగత కారణాలుగా వద్దనుకుంటోంది. జానుతో సక్సెస్ అందుకుని కొన్ని నెలల పాటు రిలాక్స్ అవ్వాలని భావించిందట. కానీ ఫలితం తేడా కొట్టింది. శర్వానంద్-సమంత జంటగా నటించిన `జాను` భారీ అంచనాల నడుమ రిలీజయింది. తమిళ్ భ్లాక్ బస్టర్ 96 కి రీమేక్ గా తెరకెక్కడంతో సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయని దర్శకనిర్మాతలు భావించారు.
కానీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద రివర్స్ అయింది. తొలి రోజు డివైడ్ టాక్ రావడం..ఒరిజినల్ లో ఉన్న ఫీల్ `జాను`లో మిస్సయ్యిందని రక రకాలుగా భినాభిప్రాయాలు వ్యక్తమవ్వడంతో అంచనాలను అందుకో లేకపోయింది. దీంతో వరుస సక్సెస్ లతో దూసుకు పోతున్న సమంత కి ఏడాది ఆరంభం లోనే జాను రూపంలో పెద్ద షాక్ తగిలినట్లైంది. ఇక ఈ ఎఫెక్ట్ యంగ్ హీరో శర్వానంద్ కు పెద్ద అవరోధంగా అమరిందని అంటున్నారు. శర్వా హీరోగా ఆర్ ఎక్స్ -100 దర్శకుడు `మహాసముద్రం` చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నాడు. అందులో సమంత నాయిక అనుకున్నారు. కానీ ఇప్పుడు జాను ఎఫెక్టు తో సామ్ ఈ ప్రాజెక్టు నుంచి డ్రాపైనట్టేనని టాక్.
ఈ ప్రాజెక్ట్ కు శర్వా- సామ్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా.. ఏడాదిన్నరగా దర్శకుడితో కలిసి ఈ ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నారు. ఇద్దరి తో అజయ్ టచ్ లో ఉంటూ కథాచర్చలు సాగిస్తున్నాడు. హీరో, హీరోయిన్లు గా చాలా మందిని పరిశీలించి చివరికి శర్వానంద్-సమంత లను ఎంపిక చేయాలనీ డిసైడ్ అయ్యాడు. కానీ జాను ఆశించిన ఫలితాన్నివ్వని నేపథ్యం లో సమంత మనసు మార్చుకుందట. మహా సముద్రం నుంచి సామ్ తప్పుకున్నట్టేనని టాక్ వస్తోంది. ఆ స్థానం లో బాలీవుడ్ నటి అథిదీరావు హైదరీని ఎంపిక చేయాలని చూస్తున్నారుట. ఇది ఎంతవరకూ నిజమో క్లారిటీ రావాల్సి ఉంది.