Movies

సాయి పల్లవి రూటు సపరేట్…అందరిలా కాదు .. కోట్లు ఇచ్చిన నో …?

చాలామంది అగ్ర హీరోలు సైతం సినిమా వేషాలకోసం వెళ్తే, చీత్కారాలకు గురైన వాళ్ళే. ఎన్టీఆర్,చిరంజీవి ఇలా చాలామంది మొదట్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో చెప్పనలవి కాదు. ఇక హీరోయిన్స్ కూడా అంతేమరి. అంతేకాదు,ఛాన్స్ వస్తుందంటే ఎలాంటి పాత్ర వచ్చినా వేయడానికి సిద్ధపడతారు. కానీ చాలా తక్కువమందికి కొన్ని కమిట్ మెంట్స్ ఉంటాయి. అందులో సాయిపల్లవి ముందు వరుసలో ఉంటుంది. ముఖం మీద మెటిమలు ఉన్న అమ్మాయి హీరోయిన్ అవుతుందా? మేకప్ అవసరం లేదు.. నేచురల్ గా ఉంటాననే అమ్మాయి ఆగ్ర హీరోయిన్ అయ్యే అవకాశం ఉందా? అంటే.. నో అని చెప్పేస్తారు. కానీ.. ఇలాంటి స్టేట్ మెంట్లను తప్పని సాయి పల్లవి నిరూపించింది .

ఇటీవల ఆమె నటించిన సినిమాలు వరుస పెట్టి ఫట్ అంటున్న వేళ కూడా బిజీగా ఉంది. ఇక హిట్ కొడితే చెలరేగిపోవటం, ప్లాప్ అయితే తెగ బాధ పడటం లాంటివి సాయిపల్లవికి అస్సలు నచ్చవు. జయాపజయాల్ని ఒకేలా తీసుకునే స్పోర్టివ్ మైండ్ సెట్ ఆమెది. ఇక చాలామంది హీరోయిన్లలో లేని కొన్ని స్పెషల్ క్వాలిటీస్ కూడా ఆమెలో చాలానే ఉన్నాయి. ఈ మధ్యన ఆమె నటించిన పడి పడి లేచే మనసు సినిమా ప్లాప్ అయ్యింది. ఈ సినిమా కింద నిర్మాత రూ.40లక్షలు బాకీ ఉన్నారు. ప్లాప్ అయ్యిందిగా ఇవ్వక్కర్లేదంటూ.. తన బాకీని రైటాఫ్ చేసేసిందట. ఇటీవల ఒక ఫేమస్ ఫేస్ క్రీం సంస్థ తాము తీసే యాడ్ లో నటించాలని, తమ క్రీం రాసుకుంటే ముఖం మారిపోతుందన్న మాటల్ని చెబితే రూ.2కోట్లు ఇస్తామంటే.. లైట్ తీస్కో అని చెప్పేసిందట.

కోట్లు ఇస్తే మాత్రం.. అలాంటి మాటలు చెబుతామా ఏంది? అంటూ సాయిపల్లవి రిజెక్ట్ చేసేసిందట. అంతేకాదు ,కథలో మిళితమైన ముద్దు సీన్లు తప్పనిసరి అని చెబితే,అలాంటి సినిమా ఆఫర్లను కూడా బ్యూటీ వదిలేసుకుంది. ఎంత సంపాదిస్తే మాత్రం.. రాత్రయ్యేసరికి తినాల్సిన మూడు చపాతీల కంటే ఎక్కువ తినలేం కదా? ఎక్కువ సంపాదిస్తే.. మాత్రం ఎక్కువ తింటారా? ఏంటని ఎదురు ప్రశ్నించటం ఆమెలోని స్పెషాల్టీ. తాను నమ్మిన సిద్ధాంతాలు.. విలువల్ని వదిలేసుకొని నటించే ఛాన్సే లేదని సాయిపల్లవి కుండబద్దలు కొట్టినట్లు సంతోషంగా చెబుతుంది. దటీజ్ సాయిపల్లవి.