ఉదయ భాను ఎంత ఖరీదైన కారు కొన్నదో తెలుసా… ఆమె లగ్జరీ లైఫ్ వెనక అసలు రహస్యాలు
ఎంత సంపాదించినా దాన్ని సద్వినియోగం చేసేవాళ్ళు కొందరైతే,దాన్ని దుర్వినియోగం చేసేవాళ్ళు మరికొందరు ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక బుల్లితెర యాంకర్ గా ఓ ఊపు ఊపేసిన ఉదయభాను సినిమా వేడుకలకు కూడా పనిచేసింది. తన అందంతో మురిపిస్తూ యాంకరింగ్ తో కుర్రకారుని ఊరుతలూగించిన ఈమె సినిమాల్లో కూడా మెరిసింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే విజయకుమార్ అనే వ్యక్తిని ఆమె పెళ్లిచేసుకుంది.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ సాగించిన ఉదయభాను 2016లో కవల ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పిల్లల సంరక్షణలో ఆమె ఇంటికే పరిమితం అయింది. ఇటీవల బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చింది. రియాల్టీ గేమ్ షో కల్యాణ లక్ష్మికి యాంకరింగ్ చేసున్న ఈమె జూ లకటక ప్రోగ్రాం కి జడ్జిగా ఉంది. మళ్ళీ బిజీగానే ఉంటున్న ఈమె బాగానే సంపాదిస్తోంది. తాజాగా బెంజి కారు కొనుగోలు చేసింది. ఇది లగ్జరీ కారు. భర్త పిల్లలల్తో ఇటీవల దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
బాగా సంపాదించేవాళ్లే కాదు,అసిస్టెంట్స్ కూడా ఖరీదైన బెంజి కార్లు కొనేస్తున్నారు. యాంకర్ మంజూష, హీరో సందీప్ కిషన్ అసిస్టెంట్ కూడా హైక్లాస్ బెంజి కార్లు కొన్నారు. ఇదే సందర్భంలో ఉదయభాను కూడా బెంజి కారు కొనేసింది. ఫ్యామిలీతో దిగిన ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.