వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి నిరాశ పర్చింది.పెద్ద ఎత్తున అంచనాలున్నా కూడా ఈ సినిమా మినిమం వసూళ్లను కూడా రాబట్టే పరిస్థితి లేదు.
విజయ్ దేవరకొండ వద్దకు ఈ కథతో దర్శకుడు క్రాంతి మాధవ్ మూడు సంవత్సరాల క్రితం వెళ్లాడు.ఆ సమయంలో వరుసగా చిత్రాలు చేస్తున్న కారణంగా ఈ చిత్రం ఆలస్యం అయ్యింది.అయితే క్రాంతిమాధవ్ ఈ చిత్రం కథతో మొదట నాని వద్దకు వెళ్లాడట.మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా హిట్ అవ్వడంతో నాని కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపించాడట.కాని కొన్ని కారణాల వల్ల పట్టాలెక్కలేదు.ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు యువ హీరోలకు దర్శకుడు ఈ కథను వినిపించడం జరిగింది.
కాని ఎవరికి కూడా దీన్ని చేసేంతటి ధైర్యం లేకపోయింది.ఈ సమయంలోనే విజయ్ దేవరకొండకు స్టోరీ లైన్ నచ్చడంతో ఓకే చెప్పాడు.విజయ్ దేవరకొండ కోసం వెయిట్ చేసిన క్రాంతి మాధవ్ ఎట్టకేలకు పూర్తి చేసి సినిమాను విడుదల చేశాడు.కాని సినిమా నిరాశ పర్చడంతో నాని ఈ సినిమా చేయనందుకు హమయ్య అనుకుంటున్నాడట.నాని మంచి సినిమాను మిస్ అయ్యాడని మొన్నటి వరకు అనుకన్నవారు ఇప్పుడు నాని జడ్జ్‌మెంట్‌ను అభినందిస్తున్నారు.