సూపర్ స్టార్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్..ప్రైమ్ లో ఫైనల్ డేట్.?
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ బిగ్గెస్ బ్లాక్ బస్టర్ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. రష్మికా మందన్నా హీరోయిన్ గా అనీల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలయ్యి మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా అలాగే టాలీవుడ్ లో కూడా మరో భారీ వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది.విడుదల కాబడినప్పటి నుంచి ఒక నెల రోజుల పాటు అదిరిపోయే వసూళ్లను రాబట్టింది.
ఇక ఎలాగో వెండితెరపై ముగింపు దశకు వచ్చేసిన ఈ చిత్రాన్ని డిజిటల్ గా వీక్షించేందుకు అభిమానులు మరియు సినీ వీక్షకులు ఎదురు చూస్తున్నారు.అయితే గత కొన్నాళ్ల నుంచీ మాత్రం “అమెజాన్ ప్రైమ్”లో స్ట్రీమింగ్ పై పలు డేట్లు మాత్రం వినిపిస్తూనే ఉన్నాయి.కానీ ఇప్పుడు మాత్రం కాస్త ట్రస్టెడ్ డేట్ వినిపిస్తుంది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.మహేష్ నటించిన ఈ బ్లాక్ బస్టర్ చిత్రం వచ్చే మార్చ్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది అని తెలుస్తుంది.మరి ఇదైనా ఫైనలైజ్ అవుతుందో లేక మారుతుందో చూడాలి.ఏది ఏమైనప్పటికీ మాత్రం ఈ సినిమా కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు రమణా..