స్టార్ హీరో కూతురిని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
అరుణ్ పాండ్యన్ ని కరెక్ట్ గా గుర్తు చేసుకోవాలంటే – ముఖ్యంగా అప్పట్లో వచ్చిన పెద్ద మల్టిస్టారర్ సినిమా ‘నక్షత్ర పోరాటం’ గుర్తు తెచ్చుకుంటే చాలు. ఆ సినిమాల్లో ముగ్గురు ఫైటింగ్ స్టార్స్ నటించారు. ఒకరు సుమన్. ఇంకొకరు భానుచందర్ అయితే – ఆ మూడో స్టారే అరుణ్ పాండ్యన్. ఆ స్టార్‌కిప్పుడు ఇంకో స్టార్. ఆమే ఈ కీర్తి పాండ్యన్. కొన్ని తమిళ సినిమాల్లో చేసింది. ఎలక్ట్రానిక్స్ లో డిగ్రీ చేసిన కీర్తి పాండ్యన్ ఇంతకాలం తండ్రి బిజినెస్‌లన్నీ మేనేజ్ చేసింది. ఈ మధ్యే తండ్రి స్ఫూర్తితో సినిమాల్లోకి కూడా వచ్చింది. తెలివికి తెలివి, అందానికి అందం, నటనకి నటన అన్నీ ఉన్నా – ఈమెకి ఇప్పటికీ మంచి బ్రేక్ రాలేదు.
ఈరోజుల్లో ఒక హీరోయిన్ ఏ భాషలో ఒక సినిమా చేసినా పక్క భాషల వాళ్లకి తెలిసిపోతుంది. అలాంటిది అరుణ్ పాండ్యన్ లాంటి యాక్షన్ హీరో కూతురయ్యుండి, హీరోయిన్‌గా అన్ని అర్హతలూ ఉండి, కీర్తికి ఇంకా మంచి గుర్తింపు రాకపోవడం బాధాకరమే. ఒకోసారి కళ్లు తిరిగే అందంతో కనిపించే కీర్తి, ఒకోసారి సాదా సీదా అమ్మాయిలాగానూ అనిపిస్తుంది. అదే ఆ అమ్మాయి సక్సెస్ కాకపోవడానికి కారణం – అంటూ కొందరు మేధావులు విశ్లేషిస్తారు గానీ – అదేం పెద్ద పాయింట్ కాదు. ఎందుకంటే హీరోయిన్ గా విజయవంతం కావాలంటే – గొప్ప గ్లామరే కాదు, ఓ సాదా సీదా అమ్మాయిలా కనిపించడం కూడా ఓ ప్లస్ పాయింట్ అవుతుంది ఒకోసారి. ఏదేమైనా కీర్తిని చూసినవారెవరైనా ఆమె హిట్టవ్వాలనే కోరుకుంటారు. సో.. నక్షత్ర పోరాటం హీరో కూతురు ఇప్పుడు స్టార్ అయ్యేందుకు నక్షత్రపోరాటం చేయాల్సి వస్తోందన్నమాట! బెస్టాఫ్ లక్ కీర్తీ!