“భారతీయుడు 2” సెట్స్ ఘోర ప్రమాదంపై బయటకొస్తున్న నిజాలు!
నిన్ననే కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి థలా అజిత్ కు తన కొత్త సినిమా షూటింగ్ లో భాగంగా చేసిన బైక్ చేజింగ్ సీన్ లో గాయపడ్డారన్న వార్త మరువక ముందే మరో విషాధం తమిళ్ ఇండస్ట్రీను కమ్మేసింది.ఇండియన్ జేమ్స్ కేమెరూన్ శంకర్ మరియు విశ్వ నటుడు కమల్ హాసన్ ల కాంబోలో సెన్సేషనల్ హిట్టయిన “భారతీయుడు” చిత్రానికి సీక్వెల్ గా స్టార్ట్ చేసిన చిత్రం “భారతీయుడు 2”
మన దక్షిణాది నుంచి ఎంతో ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ మారిన ఈ సినిమా షూటింగ్ స్పాట్ లో ఘోరమైన ప్రమాదం చోటు చేసుకుందన్న వార్త ఇప్పుడు అన్ని సినీ ఇండస్ట్రీ ప్రేక్షకులు సహా తారలను ఎంతగానో కదిలించి వేస్తుంది.ఈ ప్రమాదంలో అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ, ఆర్ట్ అసిస్టెంట్ చంద్రన్ అలాగే ప్రొడక్షన్ అసిస్టెంట్ మధు మృతి చెందారని నిర్మాణ సంస్థ “లైకా” వ్యక్తం చేసి వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పింది.
ఐతే ఇప్పుడు అసలు ఈ ప్రమాదంకు సంబంధించి పలు అంశాలు బయటకొస్తున్నాయి.ఒక క్రేన్ సహాయంతో దాదాపు 150 అడుగుల ఎత్తులో పట్టి ఉన్న భారీ లైటింగ్ సామాగ్రి క్రేన్ ఆపరేటర్ తప్పిదం వల్ల మానిటర్ దగ్గర ఉన్న పలువురు టెక్నిషియన్స్ పై పడిపోయింది అని దానితో ముగ్గురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి అని తెలుస్తుంది.ఇదే కాకుండా మరో వార్త కూడా వినిపిస్తుంది.ఈ ఘోర ప్రమాదానికి అతి దగ్గరలోనే హీరోయిన్ కాజల్ అగర్వాల్ మరియు కమల్ కూడా ఉన్నారని అందుకే కాజల్ అంత భావోద్వేగానికి లోనయ్యారని ఒక్కొక్కటిగా వార్తలు బయటకొస్తున్నాయి.