60 ఏళ్ల వయస్సులోనూ యంగ్ గా కనిపించే నాగార్జున సీక్రెట్ ఇదే…నమ్మలేరు
వయస్సు మీద పడినా ఆ ఛాయలు అసలు కనిపించకుండా మెయింటేన్ చేయడం కొందరికే సాధ్యం అవుతుంది. కింగ్ నాగార్జున లుక్స్ చూస్తే అచ్చంగా అదే అర్ధం అవుతుంది. తాజాగా నాగార్జున కొత్త ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిజానికి సరైన బ్లాక్ బస్టర్ హిట్టు లేకపోవడంతో ఈ టాలీవుడ్ మన్మధుడు డీలా పడ్డాడు. శివ తరహాలో కల్ట్ క్లాసిక్ హిట్ కావాలని ఆర్జీవీతో మరో ప్రయత్నం చేసినా అది కాస్తా డిజాస్టర్ అవ్వడం కూడా నిరాశపరిచింది. ఆర్జీవీతో `ఆఫీసర్` అస్సలు వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం `వైల్డ్ డాగ్` అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనలు అధారంగా సోలోమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో నాగ్ ఐఎన్ ఏ అధికారి ఏసీపీ విజయ్ వర్మ పాత్ర లో నటిస్తున్నాడు. ఇప్పటికే నాగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. సీరియస్ ఆపరేషన్ కి సిద్ధమైన కాప్ లుక్ లో నాగ్ అందంగా ఆకట్టుకుంటున్నాడు. తొలి పోస్టర్ లోనే ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది అని రివీల్ చేసారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో చేస్తున్నారు. కీలక యాక్షన్ సన్నివేశాలను అక్కడే తెరకెక్కిస్తున్నారు. అయితే గోవా వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నాగార్జున కెమెరా కంటికి చిక్కిన నాగ్ క్యాజువల్ వేర్ లో బాడీ ఫిట్ టీషర్టుతో సింపుల్ గా ఉన్నాడు. ఎన్.ఐ.ఏ అధికారి పాత్ర కోసం నాగ్ రెగ్యులర్ వర్కవుట్లతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడట. పర్ఫెక్ట్ లుక్ ని మెయింటెయిన్ చేస్తున్నాడు.
60 వయసులోనూ కింగ్ ఫిట్ లుక్ అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అలాగే నాగ్ తన ట్విటర్ ఖాతాలో సినిమా కు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. చాలా కాలం తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నా. ఓ రియల్ ఆఫీసర్ కథలా ఉంటుంది. కొత్త టెక్నికల్ టీమ్ తో జర్నీ బాగుంది. 2020 హ్యీపీగా సాగిపోతుందని తెలిపారు. వాస్తవానికి చైనా..థాయ్ లాండ్ లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసారు. అయితే , కరోనా వైరస్ కారణంగా షెడ్యూల్స్ వాయిదా వేసారు. కరోనా అదుపులోకి వస్తే, థాయ్ లాండ్ యూనిట్ వెళ్తుంది.