బాలీవుడ్ భామ తో దేవరకొండ హిట్ కొట్టేనా?
పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఫైటర్ చిత్రం లో అనన్య పాండే హీరోయిన్ గా నటించనుంది. అయితే ఈ విషయాన్నీ తాజాగా పూరి జగన్నాద్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ ఫై పూరి జగన్నాద్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూరి జగన్నాద్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా తరహాలో భారీ గా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే వరల్డ్ ఫేమస్ లవర్ తో మరో ప్లాప్ ను మూటగట్టుకున్న విజయ్ ఈ చిత్రం తో నైనా విజయాన్ని సాధించాలని చూస్తున్నాడు. అయితే బాలీవుడ్ భామ అనన్య పాండే విజయ్ తో నటించడం ఒకింత ప్లస్ అని చెప్పులు. ఈ చిత్రాన్ని హిందీ వెర్షన్ లో విడుదల చేసేందుకు కరణ్ జోహార్ ప్రయత్నిస్తున్నారు. వీరిద్దరి కలయిక తో పూరి మరొక బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.