నితిన్ సినిమాపైనే అందరి కళ్ళు..ఎందుకో చూడండి.!
ప్రస్తుతం నితిన్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కించిన తాజా చిత్రం “భీష్మ”. ఈ సినిమా కోసం నితిన్ అభిమానులు చాలా కాలమే ఎదురు చూసారు.ఓ రకంగా చెప్పాలి అంటే నితిన్ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ చిత్రంగా ఇది నిలిచింది అని చెప్పాలి.
ఈ చిత్రం యొక్క ఫలితం కోసమే సినీ లవర్స్ ఎదురు చూస్తున్నారు.ఈ ఏడాది విడుదల కాబడిన చిత్రాల్లో ఒక్క సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన “అల వైకుంఠపురములో” మరియు “సరిలేరు నీకెవ్వరు” చిత్రాలు తప్ప మరే ఇతర సినిమా కూడా హిట్ గా నిలవలేదు.
పలు చిత్రాలకు మంచి టాక్ వచ్చినా సరే ఎందుకో అవి కూడా లాభాల బాట పట్టలేదు.దీనితో ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు చిత్రాలు మాత్రమే హిట్టు బొమ్మలుగా నిలిచాయి.దీనితో ఈ సినిమా అయినా మూడో హిట్టుగా మారుతుందా లేదా అని సినీ ప్రేమికులు అనుకుంటున్నారు.మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకోబోతుందో తెలియాలి అంటే రేపటి వరకు ఆగాల్సిందే.