నారా లోకేష్ హడావుడిగా ఆస్తులను ప్రకటించడానికి కారణం ఏమిటో తెలుసా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హడావుడిగా ఆస్తులను ప్రకటించడానికి కారణం ఏంటని నెటిజన్లు పేర్కొంటున్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించారు. అందులో చంద్రబాబు నాయుడు మొత్తం ఆస్తులు రూ.9కోట్లు, అప్పులు రూ.5.13 కోట్లు. నికర ఆస్తులు రూ.3.87కోట్లు గత ఏడాదితో పోల్చితే రూ.87లక్షల పెరుగుదల(నికర ఆస్తిలో) బ్యాంకు లోన్ రూ.18 లక్షలు తగ్గింది. నారా భువనేశ్వరి మొత్తం ఆస్తులు రూ.50.62కోట్లు కాగా, అప్పులు రూ.11.04 కోట్లు, నికర ఆస్తులు రూ.39.58 కోట్లు, గత ఏడాదితో పోల్చితే రూ.8.50కోట్లు పెరుగుదల (నికర ఆస్తిలో) నారా లోకేష్ మొత్తం ఆస్తులు రూ.24.70 కోట్లు కాగా, అందులో అప్పులు రూ.5.70 కోట్లు, నికర ఆస్తులు రూ.19 కోట్లు గత ఏడాదితో పోలిస్తే రూ.2.40 కోట్లు తగ్గుదల కనిపిస్తోంది.
నారా బ్రాహ్మణి మొత్తం ఆస్తులు రూ.15.68కోట్లు, అప్పులు రూ.4.17 కోట్లు, నికర ఆస్తులు రూ.11.51కోట్లు, గత ఏడాదితో పోల్చితే రూ.3.80 కోట్లు పెరుగుదల ఉంది. నారా దేవాన్ష్ మొత్తం ఆస్తులు రూ.19.42 కోట్లు ఉంది. గత ఏడాదితో పోలిస్తే రూ.71లక్షలు పెరిగింది. నారా దేవాన్ష్‌కు చంద్రబాబు హెరిటేజ్‌లో తన వాటాలో ఉన్న 26440 షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చారు. నిర్వాణ హోల్డింగ్స్ (చంద్రబాబు కుటుంబ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ) మొత్తం అప్పులు రూ.37.20 కోట్లు అప్పులు ఉండేవి. రూ.34.85 కోట్లకు తగ్గుదల అయింది. నికర ఆస్తులు రూ.9.10 కోట్లు, గత ఏడాదితో రూ.2.27 కోట్లు పెరుగుదల కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే కొంత మంది ప్రతిపక్ష నేతలు బినామి ఆస్తులను కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.