క్రేజ్ ఏమైపోతోంది … అన్నీ డిజాస్టర్లేనా…మార్కెట్ పరిస్థితి మరీ ఘోరం…!
హిట్ కొడితే వచ్చే క్రేజ్ వేరు,ప్లాప్ వస్తే వచ్చే రెస్పాన్స్ వేరు. ఇప్పుడు యువ హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో రెండూ చూసాడు. ఇతడికి చాలా తక్కువ సమయంలోనే క్రేజ్ వచ్చేసింది. ‘పెళ్ళిచూపులు’,’గీతగోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ విజయాలతో యూత్ లో భారీ ఫాలోయింగ్ వచ్చేసింది. ఇక విజయ్ తన రౌడీ యాటిట్యూడ్ తో యూత్ కి దగ్గరయ్యాడు. టాలీవుడ్ కు మరో స్టార్ హీరో వచ్చాడని కొందరు టాలీవుడ్ పెద్దలే ప్రశంసలు కురిపించారు. అయితే ఈమధ్య సీన్ రివర్స్ అయింది. వరస ఫ్లాపులతో విజయ్ క్రేజ్ తగ్గిపోతోంది.
గత ఏడాది భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన విజయ్ సినిమా ‘డియర్ కామ్రేడ్’ చేదు ఫలితాన్ని అందుకుంది. పైగా ఇతగాడి క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని, సౌత్ అంతా మెప్పించాలని నాలుగు భాషలలో విడుదల చేస్తే ఎక్కడా నిలబడలేదు. పైగా ‘అర్జున్ రెడ్డి’ లా ఉందన్న విమర్శలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ ఒక సినిమా, సెకండ్ హాఫ్ మరో సినిమా అని కూడా టాక్. ఇక తాజాగా ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చినా,చేదు ఫలితమే మిగిలింది. నిజానికి ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం నుంచి విజయ్ బయటకు రాలేదన్న విమర్శలు మూటగట్టుకున్నాడు. కథ లో కథలు గా సాగిన విజయ్ పాత్రలో తికమక ఎక్కువే అందుకే ప్రేక్షకులకు నచ్చలేదు.
ఇక విజయ్ మార్కెట్ తగ్గిందనడానికి ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా ఉదాహరణగా నిలుస్తోంది. ‘గీత గోవిందం’ సినిమాకు 70 కోట్లకు పైగా షేర్ వచ్చింది. గ్రాస్ అయితే 100 కోట్లు దాటింది. విజయ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఇదే. అయితే ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కలెక్షన్లు ఫుల్ రన్ లో రూ.10 కోట్ల షేర్ కూడా రాదట. స్టార్ హీరోగా ఇంకా నిలబడ లేదనడానికి ఈ మూవీ కలెక్షన్స్ చూస్తే తెల్సిపోతోంది. స్టార్ హీరో అంటే హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా మినిమమ్ కలెక్షన్స్ రావాలి. అలా లేదు సరికదా,విజయ్ మార్కెట్ కూడా పడిపోయింది. మరి ఎలాంటి నివారణ చర్యలు చేపడతాడో చూడాలి.