Movies

కళ్ళు చెదిరే ధరకు “RRR” శాటిలైట్,డిజిటల్ రైట్స్.!

ఇప్పుడు మన తెలుగుతో పాటుగా దక్షిణాది నుంచే భారీ ప్రాజెక్ట్ గా మరోసారి ఇండియన్ సినిమాను రూల్ చేసేందుకు సిద్దమవుతున్న చిత్రం “RRR”. ఎన్నో అంచనాలను నెలకొల్పుకున్న ఈ చిత్రం కోసం ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా అది పెను సంచలనంగా మారుతుంది.

ఇప్పుడు అలాంటి ఒక వార్తే బయటకు వచ్చింది.ఇది మాత్రం నిజంగా సంచలనమే అని చెప్పాలి.ఈ సినిమా తాలూకా కేవలం శాటిలైట్ మరియు డిజిటల్ హక్కులే రికార్డు స్థాయి ధరకు అమ్ముడుపోయాయని తెలుస్తుంది.అంటే జస్ట్ అన్ని భాషల్లో ఆయా టెలివిజన్ ఛానెల్స్ లో ప్రసారమయ్యే హక్కులు అలాగే డిజిటల్ గా స్ట్రీమింగ్ చేసే హక్కులు మాత్రమే 220 కోట్లు పలికాయంట.220 కోట్లు అంటే ఇంకో “బాహుబలి 2” బడ్జెట్ అని చెప్పాలి.అది కూడా ఎలాంటి ఏరియాలు పరంగా జరగని బిజినెస్ ఇది.దీనిని బట్టి ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో మనం అర్ధం చేసుకోవాలి.