Movies

ఒకప్పుడు హీరో తరుణ్ తో నటించిన స్టార్ చైల్డ్…ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్…ఎవరో చూస్తే ఖచ్చితంగా

పెద్ద స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి రెండేళ్ల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి, తెలుగు సినీ రంగాన్ని ఓ ఊపు ఊపేసింది. అయితే చిన్నప్పుడు ఎంతగా నటించి మెప్పించిన టీనేజ్ కి వచ్చాక హీరోయిన్ గా వేసి మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడెలా ఉందొ ఆమె తెలిస్తే షాకవ్వాల్సిందే. అంజలి సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా రెండేళ్ల ప్రాయంలోనే నటించిన షామిలి నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది. హీరోయిన్ కి ఎంతైతే స్టార్ డమ్ ,ఇమేజ్ వుంటాయో అంతలా సంపాదించుకుంది.

తెలుగులోనే కాదు, తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో బిజీ ఆర్టిస్ట్ అయింది. జగదేక వీరుడు అతిలోక సుందరి,మగాడు,కిల్లర్,జోకర్ ,నిప్పురవ్వ,ఇలా 50కి పైనే తెలుగు సినిమాల్లో నటించింది. ఆతర్వాత పెరిగి పెద్దయ్యాక తెలుగు తెరపై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈమె హీరోయిన్ గా వస్తోందని ముందస్తుగా వచ్చిన హైప్,వార్తలు ,జనంలో అంచనాలు భారీ రేంజ్ లోకి వచ్చేసాయి. ఎందుకంటే ముద్దు ముద్దు మాటలతో క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ చూసిన జనానికి పెద్దయ్యాక ఇంకా అదరగొట్టేస్తుందని అనుకున్నారు.

అయితే ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. అదే ఓయ్ సినిమా. మెగాస్టార్ చిరంజీవి వంటి వాళ్ళతో కల్సి నటించిన షామిలి పెద్దయ్యాక ఇలా ఉందేంటి అని నోరెళ్లబెట్టారు. మొదటి సినిమా వరకూ ఏదోలే అనుకుంటే, ఆతర్వాత ఛాన్స్ లు రాలేదు. దాంతో గ్లామరస్ గా,సన్నగా ఉంటేనే కదా ఛాన్స్ లు వస్తాయని,బాగా సన్నబడింది. లావుగా ఉంటె తర్వాతైనా ఎడ్జెస్ట్ అయ్యేవారేమో గానీ,బక్కచిక్కాక ఆడియన్స్ అసలు ఆదరించలేదు. ఈమె అన్నయ్య రిచర్డ్ ఋషి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ,హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చేసాడు. వీళ్ళ అక్క షాలిని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి సఖి మూవీతో హీరోయిన్ గా చేసింది. ఈమె భర్త తమిళ సూపర్ స్టార్ అజిత్ . ఇలా ఫామిలీ మొత్తం సినీ సెలబ్రిటీలే.