లావయ్యావు అంటూ కామెంట్స్ చేసే వారికీ షాకింగ్ సమాధానం చెప్పిన రక్షిత
పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఇడియట్ మూవీతో రవితేజ సరసన ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రక్షిత వరుసగా స్టార్ హీరోలతో చేసింది. జూనియర్ ఎన్టీఆర్,నాగార్జున, చిరంజీవి,మహేష్ బాబు వంటి హీరోల సినిమాల్లో చేసింది. కెరీర్ దూసుకుపోతోన్న నేపథ్యంలో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ ని 2007లో పెళ్లాడిన రక్షిత ఆతర్వాత సినిమాల వైపు అడుగుపెట్టలేదు. కన్నడ ఛానల్స్ లో జడ్జిగా వ్యవహరిస్తున్న ఈమెను చూసిన వాళ్ళు ఏమిటి ఇడియట్ కి ఇప్పటికే ఎంతమార్పు అని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే రక్షిత చాలా లావెక్కిపోయింది. మిగతా హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ వలన కొంచెం స్ట్రక్చర్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటుంటే రక్షిత మాత్రం శరీర బరువు పెరిగినప్పటికీ పట్టించుకోవడం లేదు. వాలంటైన్స్ డే సందర్బంగా ఓ టివి షోలో భర్త నుంచి లవ్ బెలూన్ అందుకుంటుండగా తీసిన ఫోటో వైరల్ అయింది. ఆమె అంతగా లావు ఎక్కడంపై షోషల్ మీడియాలో ట్రోల్స్ పడిపోతున్నాయి.
దీంతో రక్షిత స్పందిస్తూ,తనను ఎందుకలా అంటున్నారని ఆవేదన వ్యక్త్యంచేసింది. తిని కూర్చోవటం లేదని,కొడుకు పుట్టాక థైరాయిడ్ సమస్య వచ్చిందని అందుకే లావెక్కానని రక్షిత చెప్పుకొచ్చింది. అయినా తాను ఇప్పుడు అమ్మ గా ఉన్నానని,హీరోయిన్ గా మెయింటేన్ చేయాల్సిన పనిలేదని స్పష్టంచేసింది. ఈమె తల్లి మమతరావు హీరోయిన్ గా చేయగా, తండ్రి బిసి గౌరీ శంకర్ సినిమాటోగ్రాఫర్. సినీ నేపధ్యం గల ఫ్యామిలీ నుంచి వచ్చిన రక్షిత పెళ్లయ్యాక సినిమాలలో నటించడం మానేసి ప్రొడక్షన్ హౌస్ నెలకొల్పి సినిమాలు నిర్మిస్తోంది.