హీరోల విలాసవంతమైన ఇల్లులు…ఎన్ని కోట్లను ఖర్చు పెట్టారో తెలుసా?
సామాన్యుల ఇల్లు చూస్తేనే లక్షలకు లక్షలు అయిపోతున్నాయి. ఇక సినీ సెలబ్రిటీల ఇల్లు చూస్తే కోట్లకు కోట్లే ఖర్చు. అధునాతన వసతులల్తో విలాసవంతమైన భవంతులు కట్టేసుకుంటున్నారు. తమ కలలకు ప్రతిరూపంగా ఎక్కడా రాజీ పడకుండా సౌధాలు నిర్మిస్తున్నారు. ఇంద్ర భవనాలను తలపిస్తున్నాయి. ముంబయిలో తన తండ్రి అల్లు అరవింద్ కి గెస్ట్ హౌస్ ఉందని,అక్కడికి వెళ్ళినపుడు బస చేస్తుంటామని చెప్పే అల్లు అర్జున్ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లో అతడు ఉండే ఇల్లే 50కోట్లు పలుకుతుంది. ఇటాలియన్ మార్బుల్స్ తో కట్టిన ఈ ఇంట్లో మినీ థియేటర్,జిమ్,5బెడ్ రూమ్స్,జిమ్,అదిరిపోయే కిచెన్,గార్డెన్ ఇలా అన్ని సౌకర్యాలున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో కట్టే కొత్త ఇంటికి భూమిపూజ చేసి,బ్లెస్సింగ్స్ అని పేరు కూడా పెట్టాడు. దేశంలో ఎవరికీ లేని విధంగా అత్యాధునిక వసతులతో ఈ భవంతి నిర్మిస్తున్నాడు.
సూపర్ స్టార్ మహేష్ బాబు కార్వాన్ ఖరీదు 6.2 కోట్లు. ఇక ఇల్లు అయితే రాజ్ మహల్ ని తలపించేలా ఉంటుంది. జూబ్లీ హిల్స్ లో దాని ధర కనీసం 20కోట్లు పలుకుతుంది. తన అభిరుచులకు తగ్గట్టు నిర్మించిన ఇంటిలో పిల్లలకు బెడ్ రూమ్స్,స్టడీ రూమ్స్,హోమ్ థియేటర్,స్విమ్మింగ్ పూల్ ఇలా అన్ని వసుతులున్నాయి. అదిరిపోయే మార్బుల్స్ అత్యాధునికంగా నిర్మించిన ఇల్లు ఇది. హైదరాబద్ మెహదీపట్నంలో జూనియర్ ఎన్టీఆర్ ఇల్లు చిన్నప్పటినుంచి ఉంటున్నదే. అయితే ప్రస్తుత ధరల ప్రకారం 30కోట్లు ఖరీదు చేస్తుందని అంచనా. ఇదికాకుండా జూబ్లీ హిల్స్ లో 40కోట్లు పెట్టి మరో అద్భుత ఇల్లు కొనేసాడు. అయితే తల్లి పాత ఇంట్లోనే ఉంటానని చెప్పడంతో ఆ ఇంటిని అధునాతనంగా మలిచి భార్య బిడ్డలతో కల్సి తల్లి దగ్గరే ఉంటున్నాడు.
బాహుబలితో వరల్డ్ ఫేమస్ అయినా ప్రభాస్ ఫిలిం నగర్ లో 35కోట్లు పెట్టి ఓ ఇల్లు కొన్నాడు. జిమ్,స్విమ్మింగ్ పూల్,ఇటాలియన్ మార్బుల్స్ ఇలాఅన్ని హంగులు ఉన్నాయి. సొంతూరు మొగల్తూరు లో కూడా ఇల్లు ఉంది. రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లిచేసుకున్న ఉపాసన హైదరాబాద్ లో తాజ్ మహల్ వంటి ఇంటిని కట్టిస్తోంది. ఎక్కడా ఏమాత్రం రాజీపడకుండా 80కోట్లతో ఈ ఇల్లు కట్టిస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ లో మెగాస్టార్ ఇల్లు చూస్తే కళ్ళు తిరుగుతాయి. ఒకేసారి 100మంది ఎలాంటి ఇబ్బంది లేకుండా గడిపేలా 25వేల చదరపు గజాల స్థలంలో అత్యాధునిక వసతులతో నిర్మించారు. ఇప్పుడిప్పుడే స్టార్ హీరో అవుతున్న విజయ దేవరకొండ ఫిలిం నగర్ లో హీరో శ్రీకాంత్ ఇంటి పక్కనే ఓ అద్భుతమైన ఇల్లు కొన్నాడు. పేరెంట్స్,తమ్ముడు ఇలా అందరికి నచ్చడంతో ధరకు వెనకాడకుండా 30కోట్లు పైనే చెల్లించి కొన్నాడు. అలాగే హైదరాబాద్ మణికొండలో వెంకటేష్ కట్టిన ఇల్లు,జగపతి బాబు షిఫ్ట్ అయిన ఇల్లు సౌకర్యవంతంగా నిర్మించినవే.