సుడిగాలి సుధీర్ సంచలన నిర్ణయం – షాక్ లో అభిమానులు
ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకంగా గుర్తింపును దక్కించుకొని, ప్రస్తుతానికి అటు టీవీ షోలు మరియు సినిమాలతో బిజీగా ఉన్నటువంటి సుడిగాలి సుడిగాలి సుధీర్ తాజాగా ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రస్తుతానికి చేతి నిండా సినిమాలతో టీవీ షోలతో బిజీగా గడుపుతున్న సుధీర్ తన సన్నిహితుల దగ్గర కొన్ని విషయాలు చెప్పుకుంటూ బాధపడ్డారని సమాచారం. కాగా ఇప్పటికే హీరోగా 2 సినిమాలు చేసినప్పటికీ కూడా ఎలాంటి ఆదరణ, విజయాలు రాకపోవడంతో తాను తప్పు చేశానని, ఇకమీదట ఇలాంటి తప్పు చేయబోనని బాధపడ్డారని సమాచారం
అంతేకాకుండా ఇకమీదట ఎవరైనా ఎంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చినప్పటికీ కూడా బుల్లి తెర ని వదిలి పోనని, ఇకమీదట సినిమాలు చేయనని చెప్పుకున్నారు. మెల్లగా ఎలాగోలాగ తన ఇమేజ్ ని బుల్లితెర మీదనే పెంచుకునేందుకే ప్రయత్నిస్తున్నానని, లేని పోనీ ప్రయోగాలతో తన జీవితాన్ని పాడు చేసుకోనని సుధీర్ వెల్లడించారు. ఇకపోతే ఇప్పటికే ఇలా బుల్లితెరమీద ఉన్న నటులు వెండి తెర మీదకి వెళ్లి తమ జీవితాన్ని నాశనం చేసుకున్న వారు చాలామంది ఉన్నారు.