నాచురల్ స్టార్ నాని ఎన్ని కోట్ల ఆస్తిని సంపాదించాడో తెలుసా? ఎవరు ఊహించరు…!
నవీన్ బాబు గంటా అంటే ఎవరికీ ,తెలీదు కానీ నిక్ నేమ్ నాని అనగానే సినిమా హీరో అని తెలిసిపోతుంది. అష్టా చెమ్మా మూవీతో తెలుగు తెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విభిన్న పాత్రలతో అలరిస్తూ తనకంటూ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వశక్తితో తెలుగు ఇండస్ట్రీలో ఎదిగిన వాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. అందులో నేచురల్ స్టార్ నాని ఒకడు.
ఇప్పటివరకూ 24సినిమాల్లో చేసిన నాని బిగ్ బాస్ సీజన్ టు కి హోస్ట్ గా వ్యవహరించాడు. ఒక్కరితో కూడా శత్రుత్వం లేకుండా పాజిటివ్ మైండ్ తో ఉండడమే నాని నిజమైన ఆస్తిగా చెబుతారు. అందుకే స్టార్ హీరో రేంజ్ కి అతితక్కువ సమయంలో ఎదిగాడు.
అయితే పాపులార్టీ,స్టార్ డమ్ తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు,అతడి టోటల్ నెట్ వర్త్ ఎంత ,ఏడాదికి ఎంత సంపాదిస్తాడు వంటి వివరాల్లోకి వెళ్తే,ఒక్కో సినిమాకు 4నుంచి 5కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడు. టోటల్ నెట్ వర్త్ 36కోట్లు ఉంటుంది. ఏడాదికి రెవెన్యూ 7నుంచి 8కోట్లు ఉంటుంది. రెండు కోట్లు విలువచేసే లగ్జరీ ఇల్లు,ఒక కోటి 50లక్షలు విలువచేసే రెండు కార్లను నాని మెయింటేన్ చేస్తున్నాడు.