Movies

అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్న సినిమా నిర్మాణం…విడిపోక తప్పటం లేదు

ఉమ్మడిగా ఉన్నప్పుడు ఎంత ఎదిగినా ఒక్కరికే పేరు వస్తుంది. కొన్నాళ్ళు ఉమ్మడిగా వ్యాపారాలు సాగించినప్పటికీ రాను రాను ఎవరి ప్రణాళికలు వాళ్లకి ఉంటాయి. ఎవరి రేంజ్ లో వాళ్ళు ఎదగాలని అనుకుంటారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అదే చర్చ నడుస్తోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లోనూ గొడవలు తప్పడంలేదు. అలాగే బడా నిర్మాతలు సైతం ఇండస్ట్రీని శాసిస్తున్నారు. అల్లు అరవింద్ ఆస్తుల పంపకం చేయడంతో అల్లు అర్జున్,అల్లు శిరీష్ ఎవరికీ వారు సొంతంగా వ్యాపారాల్లో ఎదగాలన్న ప్లాన్స్ వేస్తున్నారు.

అల్లు శిరీష్ సొంత ఓ టి టి వేదికకు సీఈవో గా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ఏ ఏ పేరుతొ బ్రాండ్ బ్యానర్ ని స్థాపించి,సొంతంగా సినిమాలు తీయనున్నాడు. అంబానీ బ్రదర్స్ మాదిరిగా గట్టిగా ప్లాన్స్ వేస్తున్నారట. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అంటూ ఎల్ ఎల్ పి అంటూ గిల్డ్ పెట్టి, నిర్మాతల మండలి నుంచి విడిపోయారు. గతంలో మైత్రి మూవీ మేకర్స్ నుంచి సిరి మోహన్ వేరుపడ్డాడు.

నవీన్ యెర్నేని,మోహన్ చెరుకూరి రవిశంకర్ లు కల్సి పెట్టిన ఈ బ్యానర్ ని రవి,నవీన్ నడిపిస్తున్నారు. వీళ్లకు అల్లు అర్జున్ బంధువు ముత్తంశెట్టి కలిశారు. అయితే ఈమధ్య ఆయన మరణించారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ని దిల్ రాజు,లక్ష్మణ్,శిరీష్ లు నడిపిస్తున్నారు. ఇందులో లక్ష్మణ్ ఐదారునెలలుగా సొంత బ్యానర్ పెట్టి సినిమాలు తీయడానికి కసరత్తు చేస్తున్నాడట. ఇప్పటికే అతడి కొడుకు లైన్ ప్రొడ్యూసర్ గా అనుభవం సంపాదించాడు.