Politics

ట్రంప్ రాకను అక్కడే ఎందుకు ఫిక్స్ చేసారు?దాని ప్రత్యేకతలు ఏమిటి లుక్కేద్దాం రండి.!

అగ్ర రాజ్యం అమెరికా 45వ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఈరోజు భారత పర్యటనకు సతీసమేతంగా వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.ఇంకొన్ని గంటల్లో ట్రంప్ భారత గడ్డపై ల్యాండ్ కాబోతున్న నేపథ్యంలో అతనికి ఘన స్వాగతం అందించేందుకు గుజరాత్ రాష్ట్రం అహమ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం ముస్తాబు అవుతుంది.అయితే ట్రంప్ రాక కోసం ఇదే స్టేడియం ను మోడీ ఎందుకు ఎన్నుకొన్నారు?ఇంతకు ఆ స్టేడియం కు ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అన్నవి ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో మన దేశ ప్రధాని అమెరికాకు వెళ్ళినపుడు ఏ ప్రధానికి జరగని విధంగా గ్రాండ్ వెల్కమ్ ను ట్రంప్ “హౌడి మోడీ” పేరిట అందించారు.దీనితో అందుకు రెట్టింపు వెల్కమ్ ను ట్రంప్ కు అందించాలని మోడీ భావించారని అందుకే ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అయినటువంటి మొతేరా స్టేడియం ను ఎన్నుకున్నారని తెలుస్తుంది.

ఇప్పటి వరకు ఆస్ట్రేలియా కు చెందిన మెల్ బోర్న్ స్టేడియం మొత్తం లక్షా 10 వేలు మంది పట్టేలా రికార్డు పొందింది.కానీ దానిని మించే విధంగా లక్షా 40 వేల మందికి పైగా జనాభా పట్టేలా ఈ స్టేడియం ను తీర్చి దిద్దాలని ఎప్పుడో భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా అది ఇప్పటికి పూర్తి కావచ్చింది.ఒకసారి లక్షా 40 వేల మంది ట్రంప్ కు స్వాగతం పలుకుతున్నారంటే ఎలా ఉంటుందో, ఎంత గ్రాండ్ గా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి.

అలాగే ఇదే గుజరాత్ కు మోడీ 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చెయ్యడం అలాగే ఇదే స్టేడియం లో సునీల్ గవాస్కర్ తన పదివేల పరుగుల మెయిలు రాయిని అందుకోవడం అలాగే మరో లెజెండరీ ఆటగాడు కపిల్ దేవ్ ఒకే ఇన్నింగ్స్ లో 9 వికెట్లు పడగొట్టిన పలు రికార్డులు కూడా ఇదే స్టేడియం లో ఉన్నాయి.ఇలాంటి కారణాలు చేత మోడీ ఇలా ఇక్కడే ప్లాన్ చేసారని తెలుస్తుంది.అప్పుడు ట్రంప్ మోడీకు “హౌడీ మోడీ” పేరిట గ్రాండ్ వెల్కమ్ చెప్తే ఇప్పుడు మోడీ ట్రంప్ కు “నమస్తే ట్రంప్” పేరిట ఈ భారీ ఘన స్వాగతాన్ని సెట్ చేసారు.