Movies

అనిల్ రావిపూడి ఈ స్టార్ డైరెక్టర్ కి కొడుకు వరస అవుతాడా…?

గత ఏడాది సంక్రాంతికి ఎఫ్ 2తో హిట్ అందుకుని ఈ ఏడాది సంక్రాంతికి సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన సరిలేరు నీకెవ్వరు మూవీతో బిగ్గెస్ట్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో అనిల్ రావిపూడి చేరిపోయాడు. శ్రీను వైట్ల దగ్గర దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన ఇతడు నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ సినిమాతో డైరెక్టర్ అయిపోయాడు. ప్రకాశం జిల్లా చిలకలూరి వారిపాలెంలో పుట్టిన అనిల్ ఫ్యామిలీ అతడి చిన్నతనంలోనే మహబూబ్ నగర్ జిల్లా అమరవాహిని పాలెంకు వ్యసాయం నిమిత్తం వలసవెళ్లింది.

చిన్నప్పటినుంచి సినిమాలు చూసే అలవాటు గల అనిల్ ప్రయిమరీ స్టడీస్ మహబూబ్ నగర్ జిల్లాలోనే సాగింది. అనిల్ తండ్రి ఆర్టీసీలో ఉద్యోగం రావడంతో వారి ఫ్యామిలీ అద్దంకి వచ్చింది. పదవ తరగతి వరకూ అక్కడే చదివిన అనిల్ ఇంటర్ కోసం గుంటూరు వచ్చాడు. వడ్లమూడిలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేసాడు. అయితే ఇంట్లో ఒప్పించి సినిమా వైపు అడుగులు వేసాడు.

అయితే అనిల్ బాబాయ్ ఒకప్పుడు ఇండస్ట్రీలో పేరుమోసిన డైరెక్టర్ గా ఉండేవాడు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కి,సూపర్ హిట్ కొట్టిన తమ్ముడు మూవీకి డైరెక్టర్ గా చేసిన అరుణ్ ప్రసాద్ స్వయానా అనిల్ కి బాబాయ్. పవన్,బాలయ్య,జగపతి బాబు ,తమిళంలో విజయ్ తదితరులతో సినిమాలు చేసిన అరుణ్ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ తో అనిల్ ఎంట్రీ ఇచ్చాడు. బాబాయ్ దగ్గర మొదట్లో దర్శకత్వ విభాగంలో పనిచేసి,పలువురు డైరెక్టర్స్ దగ్గర పనిచేసాడు. మాటల రచయితగా చాల సినిమాలకు చేసాడు. సౌర్యం,కందిరీగ, దరువు,ఆగడు,మసాలా,పండగ చేసుకో మూవీస్ కి మాటలు రాసాడు. శ్రీను వైట్ల శిష్యరికంలోనే అనిల్ కామెడీ ట్రాక్ తో సినిమాలు తీయడమే నేర్చుకుని దూసుకెళ్తున్నాడు.