Movies

సినిమాలు మాకొద్దు అంటున్న స్టార్ హీరోల పిల్లలు…హీరో అవ్వాల్సిన వీరు ఏమి చేస్తున్నారో…?

సినీ ఇండస్ట్రీలో వారసత్వ అండ ఉండే చాలు దున్నేద్దాం అనుకునేవాళ్లు ఎక్కువే. కానీ వాళ్ళ ప్రవర్తన కూడా ఇందుకు దోహదంగా ఉంటుందని తెలీదు. అయితే కొందరు సినిమాల ఇంట్రెస్ట్ లేకపోవడంతో మరొకటో తెలియదు కానీ, చాలామంది దూరంగా వెళ్లిపోతున్నారు. అప్పటి బాలీవుడ్ నటి రేఖ సోదరి రాధకు సినిమా ఆఫర్స్ వచ్చినా చేసేదిలేదంటూ పెళ్ళిచేసుకుని సెటిల్ అయింది. అద్భుతమైన డాన్సర్ కూడా అయిన ఈమె అమెరికా వెళ్ళిపోయింది.

ఇక నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ గురించి చెప్పుకొస్తే,చాలారోజుల నుంచి సినీ ఎంట్రీ గురించి చెప్పుకొస్తున్నా,ఇంకా ట్రాక్ లోకి రాలేదు. ఫాన్స్ కూడా మోక్షజ్ఞ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటే అతడు మాత్రం సినీ గ్లామర్ కి దూరంగానే ఉన్నాడు. ఫిట్ నెస్ లో కూడా తేడా రావడంతో ఇక నటించినా కష్టమే అన్నట్లు కూడా సీన్ మారింది. సినిమాలు వద్దని బిజినెస్ వైపు చూస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. జయసుధ కొడుకు శ్రేయన్ బస్తీ మూవీతో ఎంట్రీ ఇచ్చి,ఇప్పుడు సినిమాలకు దూరం అంటున్నాడు.

రాజమౌళి కొడుకు కార్తికేయ ను హీరోగా చూడాలని చాలామంది అనుకుంటున్నా,తెరవెనుక ఉండడమే ఇష్టమని అంటున్నాడట. హీరోగా చేయాలనీ అనుకోవద్దని చెప్పేశాడట. జయం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఆకట్టుకున్న యామిని కూడా సినిమాల్లో నటించేదిలేదని చెప్పేసింది. హీరో వెంకటేష్ సినిమా ఇండస్ట్రీలో అందరివాడుగా పేరుతెచ్చుకున్నారు. అతడి కొడుకు అర్జున్ దగ్గుబాటి సైతం సినిమాలంటే ఆమడ దూరం జరిగిపోతున్నాడు. కనీసం సినిమా ఫంక్షన్స్ కి కూడా రాకుండా ఉండిపోతున్నాడు. ఇక కూతుళ్లను కూడా ఇండస్ట్రీకి తేవడానికి వెంకీ సిద్ధంగా లేడట.