Business

వాట్సాప్ గ్రూప్‌లో చేరుతున్నారా? జ‌ర జాగ్ర‌త్త‌…!

ఈ మ‌ధ్య కాలంలో మ‌న‌కి ప‌రిచ‌యం ఉన్నా లేకున్నా పని లేని వారు పనికట్టుకుని మరీ క్రియేట్ చేసి వాట్సాప్ గ్రూపుల్లోకి ఆహ్వానంచడమే త‌రువాయి ఆ గ్రూప్‌ల‌లో చేరిపోవ‌ట‌మో… మ‌న నెంబ‌ర్ క‌నిపించింద‌ని ఆ పరిచయం లేని వారు గ్రూపుల్లో మ‌ల్ని యాడ్ చేయడం జ‌రుగుతునే ఉంటుంది. వీటి వ‌ల్ల వాట్సాప్ యూజ‌ర్ల ఎదుర్కోంటున్న త‌ల‌నొప్పులు అన్నీ ఇన్నీ కాదు. తాజాగా ఈ సమస్యకు చెక్ చెబుతూ వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను తెచ్చి యూజర్లకు కొంత ప్రైవసీ లభించేలా చేసింది. దీంతో మనల్ని ఎవరైనా వాట్సాప్ గ్రూపులో యాడ్ చేయాలనంటే ముందుగా మన అనుమతి త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాల్సి ఉండ‌టం కొంత ఊర‌ట నిచ్చే ప్ర‌క్రియే అని చెప్పాలి.

వాట్సాప్ గ్రూపుల్లో యాడ్ కావాలనుకునేవారు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాట్సాప్ గ్రూపుల్లోకి ఒకటి పర్సనల్ గా రిక్వెస్ట్ పంపడం ద్వారా రెండోది లింక్ ను షేర్ చేయడం ద్వారా ఆహ్వానించవచ్చు.మొదటి విధానంలో ఇబ్బందులేమీ లేవు కానీ రెండో విధానంతోనే వాట్సాప్ గ్రూపుల్లో కొత్త మోసం జరుగుతోంద‌ని సాంకేతిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

అప‌రిచిత ఎవరైనా సోషల్ మీడియాలో మ‌నం ఎక్కువ‌గా వినియోగించే ఫేస్ బుక్, ట్విట్టర్ , వాట్సాప్ ఇలాంటి మాధ్యమాల్లో లింక్ షేర్ చేసి యాడ్ అవ్వాలని కోరితే మాత్రం అనుమానించాల్సిందే అంటున్నారు. ఇలా ఆన్ లైన్ లో వచ్చే లీకులతో గ్రూపులతో యాడ్ అయ్యారో మీవ్యక్తిగత సమాచారం అప‌రిచితుల‌కు అందించ‌డ‌మేన‌ని, అవి దుర్వినియోగం అయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ప‌నిలో ప‌నిగా మన డేటా అంతటిని ఆన్ లైన్ లో ఉంటే వాటిని సేకరించే స‌రికొత్త పద్ధతులు అనేకం పుట్టుకొస్తున్నాయని, ఏదైనా గ్రూపులో మ‌నం యాడ్ అవ్వాల్సి ఉంటె నేరుగా ఆ అడ్మిన్‌కి రిక్వ‌స్ట్ పంపి యాడ్ అవ్వడమే మంచిదని సూచిస్తున్నారు. మ‌రి మ‌నం ఇది ఖ‌చ్చితంగా పాటించాల్సిందే.