ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? ఈమె మనందరికీ బాగా తెలిసిన స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరో చూస్తే…
సినిమా రంగంలో హీరో ,హీరోయిన్స్ ,క్యారెక్టర్ ఆర్టిస్టులతో పాటు కీలకంగా చైల్డ్ ఆర్టిస్టులు మారుతున్నారు. వీరికుండే క్రేజ్ చెప్పలేనిది. చూడ్డానికి చిన్నోళ్ళని తీసిపారేస్తాం కానీ వాళ్ళ టాలెంట్ ముందు అందరూ దిగదుడుపే అన్నట్లు ఉంటుందని చెప్పవచ్చు. ఒక్కోసారి హీరో హీరోయిన్స్ ని కూడా మించిపోతారు. అలాంటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. అందులో పెరిగి పెద్దయ్యాక హీరో ,హీరోయిన్స్ గా రాణించేవాళ్లను చూస్తుంటాం.
ఇలాంటి చైల్డ్ ఆర్టిస్టులతో సనాద్ సయ్యద్ అనే చిన్నారి 1998లో షారుఖ్ ఖాన్ హీరోగా చేసిన కుచ్ కుచ్ హోతా హై లో నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ అయిపొయింది. తర్వాత ఛాన్స్ లు వరుసగా వచ్చాయి. ఎన్నో సినిమాల్లో తన సత్తా చాటిన ఈమె పెద్దయ్యాక 2012లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ లో సెకండ్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. కానీ ఆతర్వాత ఛాన్స్ లు అనుకున్నంతగా రాలేదు. దీంతో బుల్లితెరపై అడుగుపెట్టి పలు టివి షోలతో బిజీ అయింది.
ఇక అందరిలాగానే సోషల్ మీడియాలో సందడి చేస్తూ,తరచూ తన ఫోటోలు పెట్టి రచ్చ రచ్చ చేసేస్తోంది. అయితే ఈ ఫోటోలు చూసినవాళ్లు మాత్రం ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సనాద్ ,ఈ హీరోయిన్ ఒకళ్ళేనా అని వాపోతున్నారు. రోజుకో ఫోటో తో సందడి చేస్తున్న ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.