Politics

వైజాగ్‌లో సెక్రటరియేట్ ఎక్కడ నిర్మిస్తున్నారో తెలుసా?

ఏపీలో మూడు రాజధానుల అంశం ఇప్పుడు తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఒకవైపు రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయడంలేదు. అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను పరిపాలన రాజధానిగా, కర్నూల్‌ని న్యాయ రాజధానిగా ప్రకటిస్తూ తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.

అయితే విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామని చెప్పిన జగన్ సర్కార్ ప్రభుత్వ భవనాలన్నిటిని ఇప్పటికే విశాఖకు మార్చే పనిలో నిమగ్నమయ్యింది. అయితే ఈ మేరకు ప్రభుత్వం ఏపీ నూతన సచివాలయాన్ని విశాఖలో నిర్మించేందుకు ప్రణాళికలు కూడా సిద్దం చేసుకుందని సమాచారం. అయితే విశాఖలోని కాపులుప్పాడు దగ్గర ఉన్న కొండ మీద దాదాపు 250 ఎకరాలలో ఏపీ నూతన సచివాలయ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.