బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ వచ్చిన డబ్బుతో ఏమి చేసారో చూడండి
బిగ్ బాస్ విన్నర్ రాహుల్ బెంజ్ కారు కొన్నాడంటే అర్ధమవుతుంది. అతడు ఓ ఇల్లు కూడా కొనుక్కున్నాడు అంటే నమ్మొచ్చు. కానీ, విన్నర్ తో పాటు అందులో పార్టిసిపెంట్స్ కూడా బాగానే సొమ్ములు చేసుకున్నారు. క్రేజ్ తో పాటు మనీ కూడా బాగానే పట్టారు. రాహుల్ లవర్ పున్నూ అయితే వరుస ఫోటో షూట్స్ తో బిజీ అయింది. ఆమె కూడా ఓ కారు కొనుక్కుంది. 2 సినిమా ఆఫర్స్ కూడా పట్టేసింది.
ఇక వరుణ్ సందేశ్, అతడి భార్య వితిక అయితే బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తమ ఇంటికి కాస్ట్ లీ ఇంటీరియర్ 2 కోట్లు అయినట్లు టాక్ వినిపించింది. ఇప్పుడు ఈ జాబితాలో తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి కూడా చేరిపోయింది. ఈమె కూడా ఓ ఖరీదైన ఇల్లు తీసుకుంది. బిగ్ బాస్ లో తనకొచ్చిన డబ్బుతో పాటు ఇతర డీల్స్ తో వచ్చిన మనీతో శివజ్యోతి ఓ ఖరీదైన ఇల్లు కొనుక్కుంది.
అంతేకాదు, 2 రోజుల కిందట ఆ ఇంటికి షిప్ట్ అయింది కూడా. ఈ సందర్భంగా శివజ్యోతి కొత్తింట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు మరోసారి సందడి చేశారు. తన కొత్త ఇంటి కోసం శివజ్యోతి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. చూస్తుంటే.. చివరి వరకు హౌజ్ లో కొనసాగిన బిగ్ బాస్ కంటెస్టెంట్లకు బాగానే గిట్టుబాటు అయినట్టుంది.