Movies

ఆ సినిమా నాశనం చేసాడని చిరంజీవి చేతిలో ఆ డైరెక్టర్ చెంప పగిలిందా… ఇందులో నిజం ఎంత?

స్వయం కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఎన్టీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ మెగాస్టార్ చిరంజీవి తెచ్చుకున్నాడు. ఓర్పు,సహనంతో ఉండే చిరు కోపం ఎప్పుడో కానీ ప్రదర్శించడని దగ్గరగా చూసిన వారంతా చెబుతుంటారు. అయితే చిరంజీవి ఆమధ్య ఓ డైరెక్టర్ చెంప పగులగొట్టాడని ఇండస్ట్రీలో పుకార్లు వ్యాపించాయి. ఇక చిరు కొడుకు రామ్ చరణ్ తేజ్ భవితకోసమే ఎక్కువ శ్రమిస్తుండాడు. రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు కూడా చెర్రీ కోసం వచ్చే కథలను మొదట్లో చిరంజీవి విన్నాకే సెట్స్ మీదికి వచ్చేది.

అడుగడుగునా కొడుకు కెరీర్ కి బంగారు బాట వేయడంలో చిరంజీవి ఎప్పుడూ శ్రద్ధ చూపిస్తూనే ఉంటాడు. ఇక రామ్ చరణ్ కూడా నటుడుగా కెరీర్ సాగిస్తూ,మరోవైపు నిర్మాణ రంగంలో అడుగుపెట్టి తనదైన శైలిలో దూసుకెళ్తున్నాడు. కెరీర్ మొదట్లో చెర్రీ నటించిన చిరుత,మగధీర మూవీస్ మంచి హిట్ అందుకున్నాయి. మగధీర మూవీతో స్టార్ హీరో అయ్యాడు. అయితే ఆతర్వాత వచ్చిన ఆరెంజ్ మూవీ అట్టర్ ప్లాప్ అయింది. ఈ మూవీకి భారీ బడ్జెట్ పెట్టేసి,విదేశాల్లో షూటింగ్ చేసినా,డిజాస్టర్ అయింది.

దారుణంగా ఆరెంజ్ మూవీ ముంచేయడంతో అందరూ నష్టపోయారు. ఈ మూవీ దెబ్బకు ఓ వ్యక్తి ఆత్మహత్య కూడా చేసుకోవాలని యత్నించాడని టాక్ కూడా వచ్చింది. దీంతో సదరు సినిమా డైరెక్టర్ పై చిరంజీవి సీరియస్ అవ్వడమే కాకుండా చెంప చెళ్లుమనిపించినట్లు వార్తలు షికారు చేశాయి. ఇది నిజమో కాదో ఇప్పటికీ తేలలేదు. అయితే తమ ఫ్యామిలీలో మూడు కుటుంబాల మధ్య ఈ మూవీ చిచ్చుపెట్టడంతో చిరు తట్టుకోలేక ఆగ్రహించినట్లు టాక్ నడిచింది. ఇక ఈ సినిమా నష్టాల్లో పాలుపంచుకోవడంతో ఓ జంట విడాకులు కూడా తీసుకుందని టాక్ వచ్చింది. మరి ఇంతమందిని దెబ్బతీసిన ఈ సినిమా గురించి సదరు డైరెక్టర్ పై చిరుకి కోపం రావడంలో ఆశ్చర్యం ఏముందని కూడా నెటిజన్స్ అంటున్నారు.