Movies

హైవే రోడ్డు పక్కన దోశలు వేసుకుంటున్న సీరియల్ హీరోయిన్…ఎలా మోసపోయిందో తెలుసా ?

సినిమా రంగంలో స్టార్ హీరోల కన్నా హీరోయిన్స్ లైఫ్ టైం చాలా తక్కువ. హీరోలు ఎంత వయస్సు వచ్చినా హీరోగానే వెలుగుతారు. అదే హీరోయిన్స్ అయితే 10,15దాటితే క్యారెక్టర్ రోల్స్ కి వెళ్లిపోవాల్సిందే. మరి ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉండే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుందని అంటున్నారు. ఇక మోసపోయే వాళ్ళు ఉంటారు. సంపాదన కూడా తక్కువగానే ఉంటుంది. ఛాన్స్ లు రాకపోయేసరికి వ్యభిచారంలోకి దిగే నటులను చూస్తూనే ఉన్నాం. కానీ ఓ టివి నటి అయితే మోసానికి బలిఅపోయినప్పటికీ ఏమాత్రం కుంగిపోకుండా, కొడుకు,కూతురు జీవితం బాగుండాలని రోడ్డు పక్కన దోశలు వేస్తూ, హోటల్ నడుపుతున్నానని గడుపుతోంది.

మిగతా వాళ్ళ విషయంలో ట్రోల్స్ వేసే నెటిజన్స్ ఈ టీవీనటి కష్టానికి హేట్సాఫ్ అంటున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే మలయాళంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ గల టివి నటి కవితా లక్ష్మి. పిల్లలను పెంచడానికి ఓ పక్కన నటిస్తూ,మరోపక్క కాఫీ హోటల్ పెట్టి దోశలు వేసుకుంటూ జీవనాధారం పొందుతోంది. 13ఏళ్ళ క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుని ఇద్దరు పిల్లలను చదివించుకోడానికి చాలా కష్టపడుతోంది. తన కుమారుడిని పై చదువులకోసం బ్రిటన్ పంపితే అక్కడ పార్ట్ టైం పనిచేస్తే, గంటకు పది పౌండ్స్ సంపాదించవచ్చని మధ్యవర్తి చెప్పిన మాటలు నమ్మి మోసపోయానని కవితా లక్ష్మి చెబుతోంది.

మొహిత్ నగారా పరిధిలో నిమ్స్ హాస్పిటల్ సమీపంలో పెట్టిన ఈ హోటల్ కి మంచి స్పందన లభిస్తోంది. ఈమె పరిస్థితి తెల్సిన ప్రొడ్యూసర్స్ కూడా పగటి పూట సీరియల్స్ లో ఛాన్స్ లు ఇస్తున్నారు. ఉదయం,మధ్యాహ్నం షూటింగ్స్ ఏర్పాటుచేసి సహకరిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్యూలో కవితా లక్ష్మి మాట్లాడుతూ తమ కుమారుడి చదువు ఖర్చు ఎక్కువగా ఉన్నందున ఇలా దోశలు వేసుకుంటూ బతుకుతున్నానని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెండు సీరియల్స్ లో నటిస్తున్న తాను ఇలా హోటల్ నడుపుతూ వచ్చిన డబ్బుని కొడుక్కి పంపుతున్నానని చెప్పుకొచ్చింది.