టాలీవుడ్ లో తండ్రుల పేరును చెడకొడుతున్న కొడుకులు వీళ్ళ!…!
ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు దూసుకెళ్తే,మరికొందరు వెనుకబడ్డారు. అందరికీ ఒకేలా దశ ఉండదు. ఇలా ఇండస్ట్రీలో చతికిల బడ్డవారి పెద్ద ఫ్యామిలీ వాళ్ళను ఒకసారి పరిశీలిస్తే, స్టార్ డైరెక్టర్ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు పరిచయం చేసిన వాళ్ళెందరో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే ఆయన కొడుకు దాసరి అరుణ్ కుమార్ మాత్రం హీరోగా వర్కవుట్ కాలేకపోయాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి మొదట్లో హీరోగా చేసి,ఫెయిలయ్యాడు. డైరెక్టర్ అవతారం ఎత్తి,సినిమాలు చేసినా తండ్రి వారసత్వాన్ని మాత్రం అందిపుచ్చుకోలేదు.
సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు రమేష్ బాబు సినిమాలు చేసి కొన్ని హిట్స్ అందుకున్నా ఎందుకో ఫేడ్ అవుట్ అయ్యాడు. అయితే రెండో కొడుకు మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు కి డీ మూవీతో స్టార్ డమ్ అందుకున్నాడు. కానీ ఆతర్వాత ఒక్క సక్సెస్ రాలేదు. అయితే 60కోట్లతో భక్త కన్నప్ప మూవీ తీస్తున్నారట. అలాగే రెండో కొడుకు మంచు మనోజ్ కెరీర్ కూడా ఇంచుమించు ఇలానే నత్తనడకన సాగుతోంది. అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ కి ఇంకా హిట్ దక్కలేదు. ఫ్యూచర్ ఉన్నా ఎందుకో తేడా కొడుతోంది. హిట్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ కొడుకులు ఆర్యన్ రాజేష్,అల్లరి నరేష్ ల పరిస్థితి చూస్తే,అల్లరి నరేష్ కి కొన్ని హిట్స్ ఉన్నాయి. ఆర్యన్ కి తేడా రావడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసినా ఫలితం దక్కలేదు.
అల్లు అరవింద్ కొడుకు బన్నీ హిట్స్ మీద హిట్స్ తో దూసుకెళ్తున్న, ఇంకో కొడుకు అల్లు శిరీష్ ఎన్ని మూవీస్ చేసినా ఫలితం రావడం లేదు. స్టార్ ప్రొడ్యూసర్ ఎం ఎస్ రాజు కొడుకు సుమంత్ మూడు నాలుగు మూవీస్ చేసినా సక్సెస్ అందుకోలేదు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె ఎస్ రామారావు తనయుడు వల్లభ రెండు మూడు సినిమాల్లో హీరోగా చేసి ఫేడ్ అవుట్ అయ్యాడు. దాంతో ప్రొడ్యూసర్ గా అవతారం ఎత్తాడు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఇండస్ట్రీలో తిరుగులేని కమెడియన్ అయ్యాడు. అయితే అతడి కొడుకు రాజా గౌతమ్ పల్లకిలో పెళ్లికూతురు,బసంతీ,మను లాంటి మూవీస్ లో చేసినా ఫలితం లేకపోయింది. ఒక్క హిట్ కూడా కొట్టలేదు.