స్టార్ యాంకర్స్ రెమ్యునరేషన్ ఆస్తులు ఎంతో తెలుసా ?
అప్పటికప్పుడు సీన్ కి తగ్గట్టు మాట్లాడ్డం,ఎక్కువ సేపు నిలబడ్డం, అలవోకగా పంచ్ డైలాగులు చెప్పడం ఇవన్నీ వస్తేనే యాంకరింగ్ కి సరిపోతారు. అయితే తెలుగు బుల్లితెరమీద చాలామంది యాంకర్స్ ఉన్నారు. ఇందులో యాంకరింగ్ లో మేల్ యాంకర్స్ కన్నా ఫిమేల్ యాంకర్స్ ఎక్కువమంది ఉన్నారు. ఇక కొందరు ఫిమేల్ యాంకర్స్ అయితే దశాబ్దాలు గడుస్తున్నా తమ హవా కొనసాగిస్తూ, దుమ్ము రేపుతున్నారు. ఒక్కొక్క యాంకర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది. ఇందులో మొదటివరసలో సుమ కనకాల ను చెప్పుకోవాలి. యాంకరింగ్ రంగంలో మహారాణిలా దూసుకెళ్తున్న సుమ చేతిలో డజనుకు పైనే షోస్ ఉన్నాయి. క్యాష్,స్టార్ మహిళ,పంచావతారం,సూపర్ సింగర్,పట్టుకుంటే పట్టుచీర, భలేచాన్స్ లే, లాక్కు,కిక్కు వంటి ప్రోగ్రామ్స్ తో అదరగొడుతూ రోజుకి 18గంటలు చొప్పున నెలకు 25రోజులు షూటింగ్ స్పాట్ లోనే సుమ గడుపుతుంది.
ఒక హీరోయిన్ ఎంత సంపాదిస్తుందో సుమ సంపాదన కూడా అంతే ఉంటుంది. ఒక్కో ప్రోగ్రాం కి లక్ష రూపాయలు తీసుకుంటుంది. సినిమా ఈవెంట్ కి ఒక్కరోజుకి మూడు లక్షల దాకా దక్కుతాయి. నెలకు 50లక్షల వరకూ వెనకేస్తుంది. జి తెలుగులో ఓ ప్రోగ్రాం కి నిర్మాత గా కూడా వ్యవహరిస్తోంది. జూబ్లీ హిల్స్ లో ఇటీవల ఆమె కొనుగోలు చేసిన ఇల్లు ఐదు కోట్లని తెలుస్తోంది. కేరళలో వారసత్వంగా వచ్చిన భూమి,హైదరాబాద్ లో ఐదెకరాల భూమి ఉన్నట్లు టాక్. భర్త ఆస్తులు కూడా కలిపితే దాదాపు 50కోట్లకు సుమ అధిపతి. హాట్ యాంకర్ అనసూయ కూడా హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని రేంజ్ లో సంపాదిస్తోంది. రెండు షోస్ కి జడ్జిగా కల్పి ఆరు షోస్ ఈమె చేతిలో ఉన్నాయి. జబర్దస్త్,జి తెలుగులో లోకల్ గ్యాంగ్,జెమినిలో తల్లా పెళ్ళామా అనే షో కూడా వస్తోంది. ఒక్క షో యాంకరింగ్ కి మూడు లక్షలు పైనే తీసుకుంటుంది. జడ్జిగా ఐదులక్షల దాకా వస్తాయి. సినిమాల్లో కూడా నటిసొంది.
రంగస్థలం తర్వాత ఒక్కో సినిమాకు 30లక్షల దాకా తీసుకుంటుంది. ఐదుకోట్ల విలువచేసే ఇల్లు,ఆడి కారు ఉన్నాయి. భర్త నెలకు 25లక్షల దాకా సంపాదన ఉందట. పొలాలు,ఇల్లు అన్నీ కలిపి 30కోట్ల ఆస్తి ఉన్నట్టు టాక్. రేష్మి కూడా మంచి ఫాలోయింగ్ గల యాంకర్. సినిమాల్లో కూడా నటించింది. జబర్దస్త్,డాన్స్ షో,సూపర్ కుటుంబం, ఐడియా,సూపర్ లాంటి షోస్ కి చేసింది. సినీ ఈవెంట్స్,ఫెస్టివల్ సమయంలో ప్రయివేట్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఒక్కో షో కి రెండు లక్షలు ముడతాయి. ఈమె పొలాలు, కార్లు,ఇల్లు అన్ని చూస్తే 10కోట్ల ఆస్తి ఉంది. ఇక శ్రీముఖి పటాస్,సరిగమ,తదితర షోస్ చేసి,బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొంది. ఒక్కో షోకి లక్ష, సినిమా ఫంక్షన్స్ కి రెండు లక్షల దాకా తీసు కుంటుంది. సినిమాల్లో కూడా పాత్రను బట్టి 5లక్షల దాకా తీసుకుంటుంది . దాదాపు 5కోట్ల ఆస్తులున్నట్లు టాక్.