Movies

మా అమ్మానాన్నలు మమ్మల్ని బలవంతంగా హీరోయిన్స్ చేసి వేధించారు

సినిమాల మీద మోజుతో ఇండస్ట్రీకి వచ్చినవాళ్ళూ ఉన్నారు,కేవలం డబ్బు సంపాదన కోసమే తమ పిల్లలను ఇండస్ట్రీకి పంపిన తల్లిదండ్రులూ ఉన్నారు. తమకు ఇష్టం లేకున్నా సరే, తల్లిందండ్రుల చేతిలో యంత్రాలుగా మారిపోయిన వాళ్ళున్నారు. ఇలాంటి ఘటనలను మీడియా ముందు చెప్పిన వాళ్ళున్నారు. అందులో మొదటగా ఆనాటి స్టార్ హీరోయిన్ కాంచన. డబ్బుకోసమే సినిమాల్లో నటించేలా చేసి,తద్వారా ఆస్తులను తమ పేరిట మార్చాలని పేరెంట్స్ వత్తిడి చేసారు. తమ మాటవినలేదని ఆమెను చంపాలని చూసారు. ఆమె పారిపోయి,కొన్నాళ్ళు ఎక్కడో తలదాచుకుంది. కోర్టుల చుట్టూ తిరిగి ఆస్తులను దక్కించుకుని తిరుపతి దేవస్థానానికి రాసేసింది.

నటి సారిక చిన్ననాటి నుంచి కష్టాలను చూసింది. తల్లిచేతిలో కీలుబొమ్మగా మారి నాలుగో ఏటనుంచే నటించడం మొదలుపెట్టింది. వయస్సువచ్చాక తల్లికి దూరంగా జరిగి కమల్ హాసన్ ని పెళ్లాడింది. ఖడ్గం మూవీలో ఒక్క ఛాన్స్ ప్లీస్ అని అడిగే సీన్ లో హీరోయిన్ సంగీత నటన అద్భుతం. చాలా మూవీస్ లో హీరోయిన్ గా వేసిన ఈమె సినిమాల్లోకి రావడానికి ఆమె తల్లి భానుమతి కారణమట. తోడబుట్టినవాడు డ్రగ్ ఎడిట్ అయిపోయి, తండ్రి కూడా చనిపోవడంతో సంపాదించే దిక్కులేక బలవంతంగా ఆమెను ఇండస్ట్రీకి తల్లే పంపించింది. 10ఏళ్లపాటు నటించి ఆ డబ్బుతో అప్పులు కూడా తీర్చింది. అయితే డబ్బుకోసం తల్లి కేసు పెట్టడంతో తాను పడ్డ నరకం గురించి సంగీత మీడియా ముందు వెల్లడించింది. చివరకు ఓ మ్యూజిక్ డైరెక్టర్ ని పెళ్ళిచేసుకుని బతుకుతుంటే అలా కూడా ఉండనివ్వడం లేదని వాపోయింది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు మూవీలో రష్మిక మందనకు తల్లిగా సంగీత నటించింది.

ఇక హీరోయిన్ అంజలి విషయానికీ వస్తే,పినతల్లి దగ్గర పెరిగి,స్టడీస్ సమయంలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. డబ్బులంటే తెలియని వయస్సులో ఏటీఎం మిషన్ లా తనను తల్లి వాడుకుంది. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఇంట్లోంచి పారిపోయి వంటరిగా ఉంటోంది. కాగా తనను ఓ మాంసం ముద్దగా మార్చి 14ఏళ్లకే సినిమాల్లోకి పంపారని మంజుల విజయకుమార్ ల కూతురు వనిత మీడియా సాక్షిగా సంచలన విషయాలను చెబితూ కన్నీటి పర్యంత మయింది. తల్లి డ్రగ్స్ కి బానిసగా,తండ్రికి డబ్బు పిచ్చని ఆమె పేర్కొంటూ అందుకే చిన్న వయస్సులో సినిమాల్లో ఉండలేక నాలుగు సినిమాలకే బయటపడి ఇల్లు వదిలేసి పెళ్లిచేసుకున్నానని తమిళ ఇండస్ట్రీలో బాంబ్ పేల్చింది. ఇప్పటికీ తనకు బాల్యం ఓ చేదు జ్ఞాపకంగా వనిత చబుతూ ఉంటుంది. తనలాగే తన చెల్లెళ్లను కూడా హీరోయిన్స్ ని చేశారని,అయితే వాళ్లకు కాస్త మంచి జీవితం దొరికిందని చెప్పింది.