Movies

తమ స్థాయిని మర్చిపోయి చిన్న సీరియల్ ఆర్టిస్ట్ లను పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్స్

ప్రేమకు హద్దులుండవు. అన్యోన్యంగా ఉండాలంటే మనసుకి నచ్చిన వాళ్ళని పెళ్ళాడి సుఖంగా ఉండొచ్చు. ఇక్కడ డబ్బు,హోదా వంటివి అసలు అడ్డు రావు. ఇలా చూస్తే ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి బుల్లితెర నటులను ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటున్నారు. అందులో ప్రధానంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ. ఈమె ఎందరో స్టార్ హీరోలతో నటించి పలు భాషల్లో తన సత్తా చాటింది.

అయితే ఛాన్స్ లు తగ్గుతున్న క్రమంలో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. సీరియల్స్ లో చిన్న నటుడైన మహమ్మద్ అప్సర్ అనే వ్యక్తి ప్రేమలో పడిన ఇంద్రజ అతడిని పెళ్ళిచేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది. 2005లో పెళ్లి చేసుకున్న ఈ జంట చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. లారెన్స్ తీసిన కాంచన సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన దేవదర్శిని తెలుగులో కూడా పాపులర్ గా గుర్తింపు తెచ్చుకుంది. మర్మదేశం డబ్బింగ్ సీరియల్ లో నటిస్తున్న సమయంలో ఆ సీరియల్ హీరో చేతన్ తో ప్రేమలో పడింది.

చేతన్ ని పెళ్లిచేసుకున్న దేవదర్శిని కి ఓ కూతురు ఉంది. ఆమెకు ఇప్పుడు 15ఏళ్ళు. ఈ పాప తమిళంలో 96మూవీలో నటించింది. ఇదే తెలుగులో జాను పేరిట తెలుగులో రీమేక్ అయింది. బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ బిపాసా పసు అందం,ఆస్తి,పేరులోనూ ఎక్కువే. అయితే వీటిలో అన్నింటా తక్కువే అయిన కరణ్ సింగ్ గ్రోవర్ ని ప్రేమించి పెళ్లిచేసుకుంది. నిజానికి అతడికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయి, విడాకులు తీసుకున్నాడు కూడా. అయినా ప్రేమకు అదేమీ అడ్డురాలేదు.