రాజకీయాలపై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. కాస్త మనసు మార్చు..!
ఏపీ రాజకీయాలను ఉద్దేశించి జనసేన నేత, హీరో నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది జరిగిన ఎన్నికలలో నాగబాబు తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మద్ధతు తెలపడమే కాకుండా, జనసేన తరుపున నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
అయితే ఆ తరువాత అప్పుడప్పుడు జనసేన పార్టీ వ్యవహారాలలో పాల్గొంటున్న నాగబాబు అధికార, ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నాడు. అయితే తాజాగా ప్రజల భావాల గురుంచి మాట్లాడుతూ లైఫ్ ఇస్తానన్న వాడిని ఓడిస్తారు. లైఫ్ తీసుకొనే వాళ్ళని అధికార, ప్రతి పక్షాలుగా ఎన్నుకొంటారని, ఏవిటో ఈ జనం. ఫ్యూచర్ జనరేషన్స్ కోసమైనా ఈ జనాల మనసు మార్చు దేవుడా అంటూ ప్రార్ధించారు.