Movies

“30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?

ప్రస్తుతం టాలీవుడ్ లో “నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్న” అనే పాట ఎంత ఫేమస్ అయిందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ పాట ఉన్నటువంటి చిత్రం “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే చిత్రం ఈ పాట వల్ల బాగానే పబ్లిసిటీ పొందుతోంది.

అయితే ఈ చిత్రానికి దర్శకత్వం వహించినటువంటి నూతన దర్శకుడు మున్నాతాజాగా ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే టాలీవుడ్ లో ఈ కథను అందరికంటే ముందుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి వినిపించానని కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ చిత్రాన్ని చేయలేదని చెప్పుకొచ్చాడు.కానీ కథను అల్లు అర్జున్ కి వినిపించినప్పటినుంచి తనకు అండగా నిలుస్తూ తగినంత సహాయం చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు.

అంతే కాక సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తనని అల్లుఅర్జున్ ఎంతగానో ప్రోత్సహించాడని కూడా చెప్పుకొచ్చాడు.అలాగే కే సినీ నిర్మాత బన్నీ వాసు కూడా ఈ చిత్ర విడుదలకి చాలా సహాయం చేశారని చెప్పుకొచ్చాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా యాంకర్ ప్రదీప్ హీరోగా తన తొలి చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అవుతుండటం తో ఈ చిత్రంపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.దీనికితోడు టాలీవుడ్ లోని ప్రముఖ సినీ నిర్మాత అయినటువంటి యూవీ క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు రావడంతో మరింత అంచనాలను పెంచుతోంది.

ఎప్పుడు తన మాటలతో యాంకరింగ్ పరంగా మాయ చేసేటటువంటి యాంకర్ ప్రదీప్ మరి హీరోగా తెలుగు ప్రేక్షకులకు ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.