ఈ విలన్ గుర్తు ఉన్నాడా…ఈ వయస్సులో ఎవరిని పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా?
లవ్ కి వయస్సుతో సంబంధం ఉండదు. కొన్నిసార్లు కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమని అనిపించక మానదు. తమ వయస్సులో సగం కూడా లేని అమ్మాయిలను కొందరు పెళ్లిచేసుకోవడం చూస్తే ప్రేమకు ఇంత ఘాటుగా ఉంటుందా అనిపిస్తుంది. టాలీవుడ్ తో సహా అన్ని భాషల్లో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాహుల్ దేవ్. సినిమాల్లో విలన్ వేషాలతో పాటు పర్సనల్ లైఫ్ లో కూడా వార్తల్లో నిలిచాడు యితడు.
రాహుల్ దేవ్ భార్య చనిపోవడంతో పదేళ్లనుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఇతడి వయస్సు 51 అయితే ఇప్పుడు ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే అతడు ప్రేమించే అమ్మాయి వయస్సు 33ఏళ్ళు. ఈమె మోడల్ గా చేస్తున్న ముగ్ద గాడ్సే . ఆమెతో ప్రేమ విషయం ఈ విషయం ఇపుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రేమకు వయస్సుతో పనిలేదని,మనసులు కలిస్తే చాలని అంటున్నాడు. డేటింగ్ చేస్తున్నారు ఇద్దరూ.
చిన్ననాటి ఫ్రెండ్ రైనాను 1998లో పెళ్లిచేసుకున్నరాహుల్ కి సిద్ధార్ధ్ అనే కొడుకున్నాడు. కొడుక్కి 11ఏళ్ల వయస్సున్నపుడు రైనా కు కేన్సర్ వచ్చింది. 2009లో ఇతడి భార్య కేన్సర్ తో చనిపోవడంతో ఇన్నాళ్లూ కొడుకు విషయంలో కేర్ తీసుకున్నాడు . అయితే ఓ ఫ్రెండ్ పెళ్ళిలో ముగ్దను చూసి ప్రేమలో పడిన విషయాన్నీ సీక్రెట్ గా ఉంచకుండా మీడియా పరంగా కూడా రాహుల్ వెల్లడించాడు. తన నాన్నకు అమ్మకు కూడా పదేళ్లు తేడా ఉందని కూడా అంటున్నాడు. ఇక తమ లవ్ ఈ విషయం తన కొడుక్కి కూడా తెలుసునని ఒప్పుకున్నాడు.