శ్యామల గ్లామర్ షో చేయకపోవడానికి అసలు కారణం ఇదే
హోమ్లీ కనిపించే యాంకర్స్ లో శ్యామల ఒకరు. యాంకరింగ్ లో తనదైన శైలిలో దూసుకెళ్తూ,ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చేసుకుంది. బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని తన టాలెంట్ చూపించింది. పెళ్లయ్యాక పిల్లలున్నా సరే, తన అందాన్ని కాపాడుకుంటూ,యాంకర్ గా కొనసాగుతోంది. అంతటితో ఆగకుండా ఏం చెప్పారు శ్యామల గారు’పేరిట యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ బిజీగా ఉంటుంది.
డిఫరెంట్ వీడియోలను శ్యామల షేర్ చేస్తూ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. దీంతో మరింతగా,తన యూట్యూబ్ ఛానల్ ని జనాల్లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే గ్లామర్ యాంకర్ గా ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎక్స్ పోజింగ్ చేయకుండా అడ్డుకున్నది నెటిజన్స్ కాదా అని ప్రశ్నించింది. కొందరి కామెంట్స్ నెగెటివ్ గా పెట్టడం వలన గ్లామర్ షోస్ ఆపేశానని చెప్పింది.
గ్లామర్ గా కనిపించాలని,వెరైటీగా ప్రోగ్రాం చేయాలనీ భావిస్తే చాలు వెంటనే కామెంట్స్ పెట్టేసి ట్రోల్స్ చేస్తున్నారని శ్యామల వాపోయింది. దేవుడా మీరు కూడా ఇలా మొదలెట్టేశారా అని తిట్టిపోస్తున్నారని యాంకర్ శ్యామల ఆశ్చర్యం వ్యక్తంచేసింది. అందుకే గ్లామర్ కి దూరం అయ్యానని చెప్పింది.