గోరింటాకు సీరియల్ హీరో నిఖిల్ బ్యాక్ గ్రౌండ్ తెలుసా?
బుల్లితెర సీరియల్స్ లో గోరింటాకు సీరియల్ ని చాలామంది ఇష్టపడతారు. నిజానికి అందరూ కొత్తవాళ్లే అయినా అందరూ నటన అదరగొట్టేయడంతో పాపులర్ అయింది. ఇక ఆ సీరియల్ లో హీరో , హీరోయిన్ లకు మంచి పేరు వచ్చింది. హీరోయిన్స్ కి సహజంగా పేరు ఎక్కువే వస్తుండడం చూస్తుంటాం కానీ, ఈ సీరియల్ లో హీరో పార్ధుకి మంచి పేరు వచ్చేసింది.
హీరో పార్ధు గా నటిస్తున్న ఇతడి పేరు నిఖిల్ మంజేకర్. కర్ణాటకలోని మైసూర్ లో సుశీల్ ,రేఖలకు పుట్టాడు. అక్కడే పెరిగాడు. థియేటర్ ఆర్ట్స్ ఫేమ్ తో వచ్చిన యితడు ఫిలిమ్స్ లో నటించాడు. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. కన్నడంలో కన్నయ్య మంత్రాలయ సీరియల్ లో నటించడం ద్వారా పాపులర్ అయ్యాడు. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయ్యాడు. మంచి హిట్ కొట్టడంతో అవార్డ్స్ కూడా సొంతం చేసుకున్నాడు.
డాన్స్ ,సాంగ్స్ పాడడం ఇలా అన్నింటా కూడా నిఖిల్ కి ప్రావీణ్యం ఉంది. టిక్ టాక్ వీడియోలతో అదరగొడతాడు. కొంచెం ఖాళి దొరికితే చాలు వెంటనే ట్రావెలింగ్ చేస్తాడు. పదినిమిషాలు టైం దొరికితే చాలు కొత్తపాట పెట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. అన్నట్టు ఇతడికి ఓ తమ్ముడు కూడా ఉన్నాడు. నిఖిల్ తో పాటు గోరింటాకు హీరోయిన్ కూడా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు.